కరోనా గణాంకాలు చెమటలు పట్టిస్తున్నాయ్.. !

NAGARJUNA NAKKA

భారత్‌లో కరోనా గణాంకాలు కలవరపెడుతున్నాయి. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల సరసన మనం చేరిపోయాం. కేసుల పరంగా ఏడో స్థానంలో... మరణాల విషయంలో మనది 13వ స్థానం. రానున్న రోజుల్లో కరోనా మరింత ఉధృతంగా వ్యాపించే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ్‌. 

 

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. కొత్తగా 8 వేల 392 మంది వైరస్‌ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 90 వేల 535కి చేరింది. ఇక కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా ప్రతిరోజూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో  230 మంది వైరస్‌తో  ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 వేల 394 కి చేరింది. 91 వేల 819 మంది వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 93 వేల 322 యాక్టివ్‌ కేసులున్నాయ్‌. పెరుగుతున్న కేసులతో భారత్‌ ప్రపంచంలోనే వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో 7వ స్థానానికి చేరింది. మరణాల్లో మాత్రం ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది.

 

కరోనా మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. దేశ ఆర్థిక {{RelevantDataTitle}}