తెలంగాణను ముంచెస్తున్న భారీ వర్షాలు..భయపడుతున్న ప్రజలు..
ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు ఉగ్ర రూపమా దాల్చుతూ వస్తుంది.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. పేదలను ఆదుకోవడానికి సినీ ప్రజలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు.
ఇకపోతే ఒకవైపు కరోనా చంపేస్తూ ఉంటె మరో వైపు అకాల వర్షాలు ప్రజాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో, పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర నిలిచిపోయింది.. భారీగా కురిసిన అకాల వర్షం రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కురవడంతో చేతికి వచ్చిన పంట నాశనమయింది.
తెలంగాణలోని పలు మండలాల్లో కోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, బత్తాయి తోటల్లో పండ్లు నేలకు ఒరిగి భారీ నష్టాన్ని చవి చూసిన తెలంగాణ వాసులకు మరో గట్టి షాక్ ఎదురవుతుంది.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గక ముందే వర్షాల ప్రభావం పెరుగుతుందని ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. ఇకపోతే రానున్న రెండు రోజుల్లో కేరళ నుంచి ఋతుపవనాలు వీస్తుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షం దాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. మరో మూడు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది..