ప్రజల గుండెల్లో జగన్.. జగన్ గుండెల్లో ప్రజలు!

Edari Rama Krishna

ఒక నాయకుడు ప్రజల మనసు గెలవాలంటే అంత సామాన్యవిషయం కాదు. ఏళ్లతరబడి రాజకీయాల్లో ఉన్న ప్రజల్లో హృదయాలు గెల్చుకోలేని ఎంతో మంది నాయకులు ఉన్నారు.  తమ మంచితనం.. మాటతీరు, సేవా, ప్రజలకు మేమున్నామంటూ ముందుకు సాగిన లీడర్లు జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచి పోతారు. అలాంటి నాయకుల్లో ఒకరు జన హృదయనేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. ప్రతిపక్షమైనా.. అధికార పక్షమైనా నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను.. ప్రజల కోసమే పోరాడుతాను అంటూ ముందుకు సాగిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.  ఆయన కడుపున పుట్టిన బిడ్డ నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

తన చదువు అయ్యాక వ్యాపార రంగంలో తనదైన మార్క్ చాటుకుంటున్న సమయంలో తండ్రి పోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగానే జనాలకు తెలిసిన జగన్ మోహన్ రెడ్డి అనుకోని పరిణామాల మద్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం.. అప్పటి వరకు తండ్రి ఎంతో సేవ చేసిన కాంగ్రెస్ మోసం చేయడంతో వైఎస్ఆర్ సీపీ స్థాపించి తాను రంగంలోకి దిగారు. గత ఏడాది ఎన్నికల ముందు ప్రజల మద్యకు వెళ్లారు.. ‘ప్రజా సంకల్పయాత్ర’తో సామాన్యు కష్టాలు దగ్గరుండి చూశారు.  

 

ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలు దగ్గరగా చూసి, నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రజలకు భోరోసా ఇచ్చారు.  అప్పటి వరకు అధికార పార్టీ చేసిన అఘాయిత్యాలు ఎండగడుతూ ప్రజలకు తెలియజేస్తూ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అన్న విషయాన్ని సవివరంగా వివరించారు.  ప్రజల గుండెల్లో సుస్థర స్థానం సంపాదించారు.   అధికారం చేపట్టిన ఏడాదిలోపే 90% మేనిఫెస్టో అమలు చేసి, మాకు జగన్ ఉన్నాడు అని ప్రజలు ధైర్యంగా అనుకునేలా పరిపాలన చేస్తున్నారు. అందుకే ప్రజల గుండెల్లో జగన్.. జగన్ గుండెల్లో ప్రజలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: