భారత్ విషయంలో బుద్ధి మార్చుకోని పాక్.... సొరంగాలు తవ్వుతూ...?

Reddy P Rajasekhar

భారత్ పాక్ మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. భారత్ ఎంత సౌమ్యంగా ఉన్నా పాక్ భారత్ తో ఏదో విధంగా గొడవ పడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. భారత్ పై ఎల్లప్పుడూ కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా పాక్ తన వైఖరిని మాత్రం మార్చుకోదు. తాజాగా పాక్ భారత్ ను దెబ్బ కొట్టాలని ఒక వ్యూహం రచించింది. అయితే పాక్ వ్యూహం బట్టబయలైంది. 
 
పాక్ సొరంగాలు తవ్వుతూ ఆ సొరంగాల ద్వారా ఉగ్రవాదులను లష్కరే తోయిబా నుంచి ఆయుధాలతో సహా పంపగా భారత్ ఆర్మీ వారిని పట్టుకుని పాక్ సొరంగం కుట్రను బట్టబయలు చేసింది. గతంలో కూడా పాక్ ఇలాంటి సొరంగాల ప్రయత్నాలు చేసి పలుమార్లు పట్టుబడింది. ఈ సొరంగాలు పాక్ స్వయంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని చెప్పడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నిజానికి ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యం ఎల్లప్పుడూ పహారా కాస్తూ ఉంటుంది. 
 
సాధారణంగా సొరంగం తవ్వడం అంత తేలిక కాదు. తీవ్రవాదులకు సైనికులు సహకరిస్తూ సొరంగం తవ్వకాలు జరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కశ్మీర్ కు పాక్ సొరంగాలు తవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సులభంగా చొరబాట్లు జరగగా ప్రస్తుతం చొరబాట్ల ద్వారా ఇతర దేశాల్లోకి ప్రవేశించడం అంత తెలికైన పని కాదు. కానీ పాక్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 
 
ఈ ఘటన ద్వారా పాక్ కుట్ర బుద్ధిని భారత్ ప్రపంచానికి పరిచయం చేసింది. పాక్ తీవ్రవాదులతో కలిసి పని చేస్తోందని భారత్ నిరూపిస్తోంది. ఈ సాక్ష్యాల ద్వారా భారత్ ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీస్తోంది. భవిష్యత్తులో పాక్ కుట్రలు భారత్ కు సాక్ష్యాలుగా సహాయపడే అవకాశం కూడా ఉంది. పాక్ తీరు మార్చుకుని ప్రవర్తిస్తే మాత్రమే ఆ దేశానికి మంచిది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: