కరోనా పేరుతో భారీ దోపిడీ.. అల్లాడుతున్న క్వారంటైన్‌ ప్రవాసులు... ?

venugopal

కరోనా ప్రతి వారిని కన్నీరు పెట్టిస్తుంది.. కాగా ఇప్పటికే ఈ వైరస్ పేరు చెప్పుకుని దోపిడీకి తెరతీసారు కొందరు.. నిజానికి ప్రపంచం అంతమై పోతున్న గానీ మనుషులు అన్యాయంగా దోచుకోవడం మాత్రం ఆగడం లేదు.. ఈ దోపిడికీ సామాన్యులే కాదు, ప్రవాసులు కూడా బలి అవుతున్నారు.. ఆ వివరాలు చూస్తే.. తెలుగు ప్రవాసులు గల్ఫ్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇందులో అమెరికా నుంచి వచ్చే వారైతే విమాన టికెట్‌కే రూ.లక్ష వరకూ చెల్లిస్తున్నారు. కాగా వారు ఇక్కడికి వచ్చాక, ఈ కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు..

 

 

అయితే వీరు సాధారణ క్వారంటైన్‌కు వెళ్లకుండా పెయిడ్‌ క్వారంటైన్‌ లో ఉంటామని ఇందుకు గాను రోజుకు రూ.5వేల నుంచి రూ.30వేల వరకు చెల్లించి ఉంటున్నారు.. అయితే ఇంతగా డబ్బులు వసూలు చేస్తున్న ప్లేట్‌ భోజనం కూడా సరిగ్గా పెట్టలేదని కొందరు ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో తమకు ఇస్తున్న భోజనం.. ఐదేళ్ల చిన్నారికి కూడా సరిపోదని మరి కొందరు తెలిపారు. ఇకపోతే కరోనా లక్షణాలు లేని వారు ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాలని చెబితే ప్రయాణానికి సిద్ధపడ్డామని, ఇక్కడికి వచ్చాక హోటల్‌ క్వారంటైన్‌ అన్నారని పలువురు గర్భిణులు పేర్కొంటున్నారు..

 

 

అసలే కరోనా ప్రభావంతో వేతనాలు సరిగ్గా రాక తాము ఇబ్బందులు పడుతుంటే.. స్వదేశానికి వచ్చాక క్వారంటైన్‌ కోసం తాము దాచుకున్నదంతా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విషయంలో అధికారులు సరైన రీతిలో స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇక ఇదేకాకుండా ఇక్కడ 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఏపీకి వెళ్తే అక్కడ మళ్లీ క్వారంటైన్‌ చేస్తారేమోనన్న భయం మరికొందరిని వెంటాడుతోందని ఇలా వెళ్లిన ప్రతిచోట తమకు ఇన్ని ఇబ్బందులు కలుగుతాయని ఊహించలేదని అంటున్నారు.. చిన్న పిల్లలను పట్టుకుని కొందరు ఉండగా, ఇందులో గర్భిణులు, మహిళలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఇదే కాకుండా రోజు రోజుకు పెయిడ్‌ క్వారంటైన్ ఖర్చులు భరించడం తలకు మించిన భారంగా పరిణమిస్తోందని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: