పీవీసీ గ్యాస్‌ ఎంత ప్రమాదకరమో తెలుసా ...?

Suma Kallamadi

నేడు విశాఖపట్టణంలో జరిగిన ఘోరమైన గ్యాస్ లీకైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. విశాఖపట్నంలోని ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి PVC గ్యాస్ లీక్ అయినట్లు కంపెనీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మామూలుగా ఈ PVC గ్యాస్ ను ప్లాస్టిక్ వస్తువులు తయారీ చేసే ప్రక్రియలో దీనిని ఉపయోగిస్తారు.నిజానికి PVC పదార్థం లేకుండా ఏ ప్లాస్టిక్ వస్తువులు కూడా తయారు చేయలేము. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాలి వినయల్ క్లోరైడ్ మిశ్రమం లేకపోతే ఎటువంటి ప్లాస్టిక్ పదార్థం తయారు అవ్వదు.

 

అయితే ఈ ప్లాస్టిక్ ను తయారు చేసే ప్రక్రియలో పాలి వినయ్ క్లోరైడ్ లో ఉండే వాయువు గనక లీక్ అయితే చాలా ప్రమాదకరమైన విషయమే. ఇప్పుడు అదే అదే ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమలో జరిగింది. ఈ పరిశ్రమను లాక్ డౌన్ తర్వాత తెరిచే సమయంలో అత్యంత విషపూరితమైన క్లోరిన్ వాయువు బయటికి వచ్చింది. ఈ క్లోరిన్ వాయువు అధికంగా కలిగి ఉండటంతో ఆ భయాన్ని పీల్చిన వెంటనే మానవ శరీరంలోని ఊపిరితిత్తుల పై నేరుగా ప్రభావం చూపుతుంది. దీనితో అక్కడి జనాలకి తీవ్ర శ్వాస సంబంధమైన వ్యాధులు తలెత్తుతాయి.


ఈ క్లోరిన్ వాయువు వాతావరణంలోని ఆక్సిజన్ తో కలిసిపోయి డయాక్సైడ్ ను ఏర్పాటు చేసుకొని అత్యంత ప్రమాదకరంగా మారిపోతుంది. ఇలా మారిన తర్వాత వెంటనే మనుషులతో పాటు మూగజీవాలు పక్షులు ఇలా అన్నీ అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత చనిపోవడం జరుగుతుంది. అంతేకాదు చుట్టుపక్కల ఉండే చెట్లు కూడా మాడిపోతాయి. మనం ధరించే దుస్తులు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి అంటే నమ్మండి. పాలి వినైల్ క్లోరైడ్ లో ఉండే క్లోరిన్ మనిషికి క్యాన్సర్ రావడంలో కూడా కారకం అవుతుంది. ఏదిఏమైనా ఈ సంఘటన జరగడం చాల విచారించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: