విజయ్ దేవరకొండ గొడవ వెనక వైఎస్.జగన్ టార్గెట్...!
యంగ్ హీరో విజయ్ దేవరకొండపై ఓ వెబ్‌సైట్ ఏదో పని గట్టుకుని ఏదో కథనం రాసిందని... అతడిని ఇంటర్వ్యూ అడగగా విజయ్ ఇవ్వకపోవడంతో ఆ వెబ్‌సైట్ కావాలనే పని గట్టుకుని విజయ్‌ను టార్గెట్ చేసిందని అతడు ఆరోపించాడు. చివరకు అతడు ఆ వెబ్‌సైట్‌ను ఏకేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయగా దానికి టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు అందరూ ఏకమై విజయ్‌కు మద్దతు ఇస్తున్నారు. ఇక నిన్న అంతా సోషల్ మీడియాలో ఇక్కడ తెలుగు హీరోల్లో స్టార్లు చిరు, నాగ్ నుంచి అటు తమిళనాడులో రాధిక వరకు అందరూ విజయ్ కిల్ ఫేక్ న్యూస్ ట్యాగ్‌కు మద్దతుగా నిలిచి కామెంట్లు పెట్టారు.
ఇక సినిమా వాళ్లకు కొద్ది రోజులుగా తమపై లేనిపోని గాసిప్పులు రాసే ఈ ఫేక్ వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్‌పై ఉన్న అక్రోషం అంతా నిన్న బట్ట బయలు అయ్యింది. ఎవరికి వారు ఆ వెబ్‌సైట్‌తో పాటు మరో రెండు మూడు గాసిప్ వెబ్‌సైట్లపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఇక దీనికి ఈనాడు ఈ రోజు పెద్ద బ్యానర్ టైప్ వార్త ఇచ్చింది. ప్రతి పేపరు.. ప్రతి టీవీ దీనికి పెద్ద ప్రయార్టీయే ఇచ్చాయి. అక్కడి వరకు బాగానే ఉంది. ఇంత గొడవ జరుగుతున్నా సాక్షి పేపర్లో ఈ వివాదం గురించి ఎక్కడా చిన్న వార్త కూడా రాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అది కాసేపు పక్కన పెడితే దీనిపై తెలుగుదేశం ఫాలోవర్లు సోషల్ మీడియా సాక్షిగా విజయ్‌కు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. విజయ్‌పై నెగిటివ్ వార్తలు రాయడం ఆ వెబ్‌సైట్‌కు సరికాదని.. ఆ సైట్ తీరే అంతని మండి పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటా ? అని ఆరా తీస్తే ఆ వెబ్‌సైట్ ఇండస్ట్రీలో గాసిప్పులే కాకుండా 2014 ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ, వైస్.జగన్‌కు అనుకూలంగా ఉంటూ వస్తోంది. చంద్రబాబు, టీడీపీ అంటే నిత్యం విషం చిమ్ముతూ ఉంటుంది.
అందుకే ఈ కోపాన్ని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తీర్చుకుంటూ విజయ్‌కు మద్దతు ఇస్తామని పోస్టులు పెడుతున్నారు. ఇలా పరోక్షంగా జగన్‌పై అక్కసు తీర్చుకుంటున్నారు. అంతకు మించి విజయ్‌కు, జగన్‌కు మధ్య ఇక్కడేం కుల, రాజకీయ పంచాయితీలు ఏం లేవు.