తెలంగాణ అంతా ఓకే.... ఆ ఒక్క ప్రాంతం తప్ప...!

Arun Showri Endluri
తెలంగాణలో రెండు రోజులుగా ఆందోళన కలిగించిన కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సోమవారం (మే 4) కొత్తగా 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రానికి ఇది ఊరట కలిగించే వార్త. 

రాష్ట్రంలో 1096 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితేఇందులో 643 మంది ఇప్పటివరకుడిశ్చార్జ్అయ్యారు. అయితే ఇంకా 439 మందికిట్రీట్మెంట్ కొనసాగుతుంది. ముందునుంచి మన రాష్ట్రంలో పకడ్బందీగా ఉన్నాం దేశంలో మొదట కంటైన్ మెంట్ మన కరీంనగర్ లో చేశాముఅని కేసీర్ తెలిపారు.

అయితే ఇప్పటివరకుమరణాల రేటు 3.37 దేశంలోఅలాగే మన రాష్ట్రం లో 2.24  ఉంది. అలాగేరికవరీ శాతంకూడా తెలంగాణలో 50 కన్నా ఎక్కువ. రాష్ట్రంలో కరోనా బారిన పడినవారిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే 40 శాతం మంది ఉండటం గమనార్హం. వీరు కరోనా మహమ్మారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.

తెలంగాణలో 35 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఇందులో 19 హైదరాబాద్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 66 శాతం కేసులు ఉన్నాయి. 80 శాతంపైగా మరణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌ను తెలంగాణ వాసులు మరియు ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ ఎంత అద్భుతంగా కోలుకుందో ఈ లిస్టు చూస్తే మనకు అర్థమవుతుంది. గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య:

ఏప్రిల్ 25 - 7

ఏప్రిల్ 26 - 11

ఏప్రిల్ 27 - 2

ఏప్రిల్ 28 - 6

ఏప్రిల్ 29 - 7

ఏప్రిల్ 30 - 22

మే 1 - 6

మే 2 - 17

మే 3 - 21

మే 4 - 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: