జగన్ క్యారెక్టర్ గురించి ఆ టీడీపీ నేతకు బాగా తెలుసనుకుంటా..అందుకే మంత్రి పదవి మిస్

M N Amaleswara rao

మాట తప్పం..మడమ తిప్పం అనే పదాలు సీఎం జగన్ కు సరిగా సరిపోతాయనే విషయం తెలిసిందే. ఆయన ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. అందుకే ఆ స్లోగన్ తోనే ఇన్నేళ్లు రాజకీయం నడిపించిన జగన్, ముందు ఓడిపోయినా, తర్వాత మాత్రం అదిరిపోయే విజయం సాధించగలిగారు. ఇక సీఎం అయిన దగ్గర నుంచి తాను ఇచ్చిన హామీలని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అమలు చేస్తూ వచ్చారు.

 

అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ క్యారెక్టర్ ని నెగిటివ్ చేయడంలో భాగంగా, ఆయన మొండివాడని, ఎవరు మాట వినడని, కక్ష సాధింపు పాలన చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ..జగన్ గురించి బాగా తెలిసినట్లు మాట్లాడారు. జగన్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే..అది ప్రజలకు చెడు అయినా వెనక్కి తగ్గడని చెప్పారు.

 

అంటే గతంలో నెహ్రూ జగన్ నాయకత్వంలో పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన్ని దగ్గర ఉండి చూసిన నెహ్రూ..తర్వాత టీడీపీలోకి వచ్చాక జగన్ వ్యక్తిత్వం నచ్చలేదని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసారు. నిజానికి జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు. కానీ ప్రజలకు మంచి చేసే విషయంలో పలుసార్లు కొన్ని నిర్ణయాల్లో మార్పులు కూడా చేసారు.

 

ఆ విషయం నెహ్రూకు అర్ధం కాలేదనుకుంటా. అసలు 2014 లో వైసీపీ తరుపున గెలిచిన నెహ్రూకు, జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అసెంబ్లీలో కూడా ఆయన మాటకు ఎక్కువ విలువ ఉండేది. జగన్ అలా విలువ ఇస్తే, నెహ్రూ మాత్రం మోసం చేసి టీడీపీలోకి వెళ్లారు. అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి చూసారు. ఒకవేళ ఆయన వైసీపీలో ఉండుంటే మంత్రి పదవి కూడా దక్కేది. కానీ నెహ్రూకు బ్యాడ్ లక్ టీడీపీ రూపంలో ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: