జగన్ పట్టుబడితే వదలడుగా.. ఇక నిమ్మగడ్డ పని అయిపోయినట్టేనా..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఏదైనా అనుకుంటే దాన్ని ఒక పట్టాన వదలడన్న పేరుంది. ఇప్పుడు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇదే జరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేవలం చంద్రబాబు అండ్ కో సూచనల మేరకే అప్పటికే ప్రారంభమైన ఎన్నికలను వాయిదా వేయించారని జగన్ బలంగా నమ్ముతున్నారు. అయితే నిమ్మగడ్డ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నందున అప్పటికప్పుడు ఏమీ చేయలేకపోయాడు.

మొత్తానికి నిమ్మగడ్డను టార్గెట్ చేసిన జగన్.. దీనికోసం అనేక మంది మేధావుల సలహాలు తీసుకున్నారు. మొత్తానికి చట్టంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గించడం ద్వారా ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో నిమ్మగడ్డ పదవీచ్యుతుడయ్యారు. ఆయన తన పదవి కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కోర్టులు తేల్చాల్సి ఉంది. అయితే జగన్ అక్కడితో ఊరుకుంటారా..?

అసలు తన సర్కారు అక్రమాలు చేస్తోందంటూ నిమ్మగడ్డ కేంద్రానికి రాసినట్టుగా చెబుతున్న లేఖ పుట్టుపూర్వోత్తరాలు సీఐడీ ద్వారా విచారణ చేయిస్తున్నారు. దీంట్లో అనేక అనుమానాస్పద విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ లేఖ నిమ్మగడ్డ ల్యాప్ టాప్ కు బయటి నుంచి వచ్చిందట. ఆ తర్వాత పెన్ డ్రైవ్ లో రమేష్ కుమార్ తీసుకున్నారట. ఆ తర్వాత పెన్ డ్రైవ్ ద్వంసం చేశారట. అయితే ఈ పెన్ డ్రైవ్ ఆధారాలు ఎందుకు ధ్వసం చేశారని నిమ్మగడ్డ పీఏ ను అడిగితే సంతృప్తికర సమాధానాలు చెప్పలేదట.

ఇక ఇప్పుడు ఆధారాల పునరుద్దరణ కోసం సీఐడీ ప్రయత్నిస్తోందట. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారట. విజయసాయిరెడ్డి ఆరోపించినట్టు అది టీడీపీ ఆఫీసు నుంచి వచ్చినట్టు తేలితే.. నిమ్మగడ్డ పూర్తిగా ఇరుక్కునట్టే అవుతుంది. అదే నిజమైతే.. ముందు ముందు నిమ్మగడ్డకు గడ్డు పరిస్థితులు ఖాయమనే చెప్పాలి. అంతే మరి జగన్ పగబడితే అంత సులభంగా వదిలేస్తాడా మరి. అందులోనూ తన శత్రువుతో చేయకలిపితే.. చూస్తూ ఉరుకుంటాడా..? చూడాలి ఈ రాజకీయం ఏం మలుపు తిరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: