కరోనా వల్ల రోడ్డున పడ్డ తెలంగాణ సర్కార్ .. ఎన్ని కోట్లు అప్పు ఉందొ తెలుసా ?
ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు .
ఇకపోతే కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది పేదలకు అన్నదానం అందజేస్తూ వస్తున్నారు.. మరీ కొందరు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.ప్రజల్లో కొత్త ఉస్తాహాన్ని నింపుతున్నారు..
కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..లాక్ డౌన్ ఎఫెక్ట్ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఉత్పత్తులు, ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇక లాక్ డౌన్ వేళ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు తప్పనిసరి కొనసాగించాల్సిన స్థితి నెలకొంది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 4 వేల కోట్లు అప్పు చేసింది. ఏప్రిల్ 13న రూ.2వేల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ సర్కారు.. తాజాగా బాండ్ల అమ్మకం ద్వారా మరో రూ.2 వేల కోట్లు సేకరించింది. ఇక ఇదిలా ఉండగా, పన్నుల వాటా కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.982 కోట్లను సోమవారం కేంద్రం విడుదల చేసింది. దీంతో దీంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5 వేల కోట్ల ఆదాయం చేరినట్లు అయింది. కాగా ఈ డబ్బును కరోనా నివారణ చర్యలు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ కోసం తదితర వాటికి విఇయోగించనున్నారు.