ఢిల్లీ మర్కజ్ ఎఫెక్ట్...ఏయే రాష్ట్రాల్లో ఎంత శాతం కేసులు నమోదయ్యాయో తెలుసా...?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖల నుంచి దీనికి సంబంధించిన క్రీలక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. దేశంలో మొదట్లో కరోనా కేసులు నమోదు కాకపోయినా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల వల్ల ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
మర్కజ్ ప్రార్థనలు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. తబ్లీగీ చీఫ్ చేసిన తప్పు వల్ల నేడు అధిక సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో మర్కజ్ సదస్సుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. సదస్సు వల్ల ప్రస్తుతం కొంతమంది జీవితాలే ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రార్థనలు ఎక్కువగా దేశంలో 5 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా 84 శాతం కేసులు ఈ ప్రార్థనల వల్లే నమోదయ్యాయి. తెలంగాణలో 79 శాతం కేసులు ఈ ప్రార్థనల వల్లే నమోదయ్యాయి. ఢిల్లీలో 63 శాతం, ఏపీలో 61 శాతం కేసులు, ఉత్తరప్రదేశ్ లో 59 శాతం కేసులు నమోదయ్యాయి. నిజానికి కేంద్రం తొలి దశలోనే లాక్ డౌన్ తో దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుందని భావించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. మరోసారి కేంద్రం లాక్ డౌన్ పొడిగించాలని భావించినా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఇప్పటికే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరి కేంద్రం మే 3వ తేదీ లోపు కరోనా వ్యాప్తి తగ్గకపోతే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.