ప్రతీ ఇరవై సెకండ్లకు ఒక ప్రాణం..! అక్కడ కరోనా ను ఆపేవారే లేరా?

Arun Showri Endluri
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ పేరు అంటేనే ఒక బ్రాండ్. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా వ్యాపార, వాణిజ్య మరియు టెక్నాలజీ రంగాల్లో అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడి తీవ్రంగా నష్టపోయిన దేశాలలో కూడా మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

ఇప్పటికే అమెరికాలో ఈ కరోనా వైరస్ ఏడు లక్షల మందికిపైగా సోకగా వారిలో 35 వేల మంది మృతి చెందడం గమనార్హం. ఒక్క న్యూయార్క్ మహానగరంలోని 16 వేల మంది చనిపోయారు అంటే కరోనా ప్రభావం ఎక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే శుక్రవారం రోజు కేవలం 24 గంటల వ్యవధిలో దాదాపు 4591 మందిని బలి తీసుకుంది ఈ ప్రాణాంతక వైరస్. ఈ లెక్కన ప్రతి నిమిషానికి ముగ్గురు చొప్పున అమెరికా దేశంలో చనిపోగా అంటే ప్రతి ఇరవై సెకండ్లకు ఒకరు మృతి చెందారు అన్నమాట. ఈ లెక్కలు చూస్తుంటేనే ప్రపంచ దేశాల ప్రజలకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇకపోతే తాజాగా నమోదైన కేసుల లో 30 శాతం మంది ఆఫ్రికన్-అమెరికన్ ప్రజలే ఉండటం గమనార్హం న్యూయార్క్ నగరం అనుభవిస్తున్న వేదన ప్రపంచంలో ఏ మహానగరం ఇప్పటివరకు అనుభవించలేదు.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అమెరికా లో ఇప్పటికే ఒక మిలియన్ కేసుల దిశగా దూసుకెళ్తున్న కరోనా వైరస్ ను నియంత్రించకపోతే దాదాపు ఎంత లేదన్నా 2.7 లక్షల ప్రాణాలను ఈ వైరస్ బలి తీసుకుంటుందట. కాబట్టి ఇప్పటికైనా ట్రంప్ అలసత్వం వదిలి వైరస్ ను నియంత్రించేందుకు చర్యలు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టి తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: