సమయానుకూలంగా రాజకీయం మార్చబడును ! అంతేనా గంటా ?

రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఎదురు లేకుండా కొనసాగాలంటే ఏ విధమైన ఎత్తుగడలు వేయాలి తెలుసుకోవాలంటే మాజీ మంత్రి ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటారు గంటా శ్రీనివాసరావు. 2012లో kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో  బాధ్యతలు చేపట్టిన గంటా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఐదేళ్ళ పాటు మంత్రిగా పని చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినా, దానిని తట్టుకుని మరీ టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచిన దగ్గర నుంచి టిడిపికి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరబోతున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ చేరిక వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. 

 

ఇక ఆ తరువాత గంట టిడిపికి చెందిన సుమారు 13 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత అది కూడా వాయిదా పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వీలైనంత ఎక్కువగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే గంటా మాత్రం ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శించే  సాహసం చేయడం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్న సమయంలోనే గంటా సీఎం జగన్ కు లేఖ రాశారు. విశాఖలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ పెట్టాలంటూ ఆయన కోరారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వం కూడా కరోనా టెస్టింగ్ లాబ్ ను మంజూరు చేసింది. 

 


దీంతో తాను లేఖ రాయబట్టే జగన్ కరోనా టెస్టింగ్ ల్యాబ్ మంజూరు చేసినట్లు గంటా తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శించి వ్యతిరేకత పెంచుకునేకంటే సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్నట్టుగా  వ్యవహరిస్తున్నారు. ఇలా ఎక్కడా తనకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ తన రాజకీయ జీవితం సాపీగా సాగిపోయేలా చేసుకోవడంలో గన్థా ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: