కరోనాకు మందు కనిపెట్టిన మెల్‌బోర్న్‌ శాస్త్రవేత్తలు... రెండు రోజుల్లో వైరస్ అంతం...?

Reddy P Rajasekhar

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,500 దాటింది. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా భారీన పడి ఇప్పటివరకూ 91 మంది మృతి చెందారు. కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌ కు చెందిన పరిశోధకులు కరోనాకు మందు కనిపెట్టడంలో విజయం సాధించారు. 
 
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒక యాంటీ వైరల్ ఔషధంతో పరిశోధనలు చేసి రెండు రోజుల్లో కరోనా వైరస్ ను అంతం చేయడంలో సఫలం అయ్యారు. పరిశోధకులు మానవులపై ఈ ఔషధంను ప్రయోగించాల్సి ఉందని చెబుతున్నారు. ఇవెర్‌మెక్టిన్‌ అనే ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు దేశాల్లో కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు చికిత్సలో భాగంగా వినియోగిస్తున్నారు. ఈ ఔషధం జికా, డెంగీ, హెచ్.ఐ.వీ వైరస్ లపై సమర్థవంతంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. 
 
ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇవెర్‌మెక్టిన్‌ ను కరోనా వైరస్ పై ప్రయోగించి... ఈ ఔషధం వైరస్ పై సమర్థవంతంగా పని చేస్తుందని తేల్చారు. వైరస్‌కు సంబంధించిన ఆర్‌ఎన్‌ఏను ఒక డోస్ తో రెండు రోజుల్లో పూర్తిగా నిర్మూలించినట్లు గుర్తించామని చెబుతున్నారు. ఒకరోజులోనే వైరస్ గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. అయితే ఈ ప్రయోగాలను తాము ల్యాబ్ లోనే చేశామని మనుషులపై త్వరలోనే ప్రయోగిస్తామని చెబుతున్నారు. 
 
చైనాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ప్రస్తుతం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తొలి దశ ఫలితాలు త్వరలోనే వెలువడతాయని సమాచారం. ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా పూర్తి స్థాయిలో కట్టడయ్యే అవకాశం ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: