ఏప్రిల్ 6న ప్రధాని మోదీ కీలక నిర్ణయం...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజు 400కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. కానీ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా భారీన పడి 86 మంది మృతి చెందారు. 
 
మరికొన్ని రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండడంతో మోదీ ఈ నెల 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మోదీ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేస్తామని మోదీ సీఎంలతో చెప్పారు. 
 
భారత్ లో రోజురోజుకు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. మరోవైపు దేశంలో లాక్ డౌన్ అమలు చేయడం వల్లే పరిస్థితులు అదుపులో ఉన్నాయని లాక్ డౌన్ ఎత్తివేస్తే కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
దినసరి కూలీలు, వ్యాపారులు మాత్రం లాక్ డౌన్ ను ఎత్తివేస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. భారత్ లో కరోనా కట్టడి కావాలంటే కొత్త కేసులు నమోదు కానంత వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోదీ లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 6 వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: