తెలంగాణలో భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య... కారణం ఏమిటంటే...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో అంచనాలకు అందని రీతిలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ఒక్కరోజులో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకేరోజు భారీగా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 229కు చేరగా మృతుల సంఖ్య 11కు పెరిగింది. 
 
ఇప్పటివరకూ రాష్ట్రంలో 32 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 186 మంది కరోనా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు పెరగటానికి మర్కజ్ మత ప్రార్థనలే కారణమని సమాచారం. వీరి కారణంగా రాష్ట్రంలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కాంటాక్ట్ కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. 
 
మెదక్ లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఒకే ఇంట్లో కరోనా సోకిన వ్యక్తి భార్య, కూతురు, కోడలుకు కరోనా నిర్ధారణ అయింది. జిల్లాల వారిగా కరోనా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రేపటినుంచి లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు కాబోతున్నట్లు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఏపీలో ఇప్పటివరకూ 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అనంతరం కొత్త కేసుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో  కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: