దేశ ప్రజలకు మోదీ శుభవార్త... లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం...?
దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 1834 మంది కరోనా భారీన పడ్డారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం లేదని గతంలోనే చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు మోదీ లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించకూడదని... అప్పటిలోపు దేశవ్యాప్తంగా కరోనాను కట్టడి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారీగా కరోనా కేసులు పెరుగుతున్నా మరో రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు ఏప్రిల్ 15 నుంచి విమానయాన సంస్థలు, భారతీయ రైల్వేస్ బుకింగ్స్ మొదలుపెట్టడంతో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. ఏప్రిల్ 12 తర్వాత కేంద్రం మరోసారి సమీక్ష జరిపి లాక్ డౌన్ గురించి అధికారికంగా ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఒకవేళ లాక్ డౌన్ గడువు పొడిగిస్తే మాత్రం టికెట్ బుక్ చేసుకున్నవారి ఖాతాలకు డబ్బులు జమ చేస్తారు.
గత రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న వారే ఎక్కువగా కరోనా భారీన పడుతూ ఉండటం గమనార్హం. తెలంగాణలో ఇప్పటివరకూ 127 కరోనా పాజిటివ్ కేసులు నమోధు కాగా వీరిలో 9 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకూ 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.