కరోనా విషయంలో కేంద్రం చేస్తున్న తప్పు ఇదేనా.... టెస్టింగ్ సదుపాయాలు పెంచడంలో ఎందుకింత ఆలస్యం...?
ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కరోనా వ్యాప్తిని ఆలస్యం చేయవచ్చేమో కానీ కరోనాకు పరిష్కారం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ పై కేంద్రం యుద్ధం చేయడమే సమస్యకు పరిష్కారమని... దక్షిణ కొరియా లాక్ డౌన్ లేకుండానే కరోనాను కట్టడి చేసిందని మన దేశం కూడా ఇదే విధంగా కరోనాపై యుద్ధం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ట్రేస్, టెస్ట్, ట్రీట్ అనే ఫార్మట్ ద్వారా దక్షిణ కొరియా కరోనాను కట్టడి చేసింది. టెస్టింగ్ సదుపాయాలను పెంచుకోవడం ద్వారా మాత్రమే మన దేశంలో కరోనాను పూర్తిగా కట్టడి చేయడం సాధ్యమవుతుంది. భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ వైరస్ ప్రబలితే మాత్రం వేల సంఖ్యలో కేసులు నమోదవుతాయి. కేంద్ర, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ దాదాపుగా 35,000 మందికి కరోనా టెస్టులు జరిగాయి.
వీటిలో 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో ప్రతిరోజూ దాదాపు 20,000 మందికి పరీక్షలు జరిపారు. ఈ విధంగా చేయడం వల్లే అక్కడ కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకోగలిగారు. మన దేశంలో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ లు చాలా తక్కువగా ఉన్నాయి. సరైన టెస్టింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో పరిమిత సంఖ్యలోనే నమూనాలను సేకరించి మన దేశంలో వ్యాధి ఉందో లేదో నిర్ధారిస్తున్నారు.
అమెరికాలో కూడా టెస్టింగ్ సదుపాయల కొరత ఉంది. టెస్టింగ్ కిట్స్ లో వాడే రసాయనాలు అందుబాటులో లేకపోవడం, లాక్ డౌన్ వల్ల విమాన ప్రయాణాలు ఆగిపోవడం, టెస్టింగ్ కిట్లు వచ్చినా ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉండటం, డిమాండ్ కు తగిన విధంగా టెస్టులు చేయలేకపోవడం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కేంద్రం టెస్టింగ్ సదుపాయాలను పెంచితే కరోనాను వేగంగా తగ్గించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple