బిగ్ బ్రేకింగ్: కరోనా అనుమానితుల జాబితాలో పలువురు ఏపీ ఎమ్మెల్యేలు...!
నిన్నమొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఏపీ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అయితే ఇప్పుడు ఏపీ సైతం కరోనా పేరు చెపితే వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. ఏపీలో వారం రోజులుగా కరోనా పాకిపోతోంది. కేవలం ఒక్క కేసుతో చాలా రోజుల పాటు ఉన్న ఏపీలో ఇప్పుడు కరోనా బాధితులు ఏకంగా 13కు చేరిపోయారు. ఏపీలో విదేశాల నుంచి వచ్చిన వారే ఏకంగా 29 వేల మంది వరకు ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. ఇక నిన్నటి వరకు ఏపీలో గుంటూరు జిల్లా కరోనాకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండేది.
ఇప్పుడు కరోనా పేరు చెపితేనే గుంటూరు వణికిపోతోంది. గుంటూరు జిల్లాలోనే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా అంతటా హై ఎలెర్ట్ ప్రకటించారు. ఇక ఇప్పుడు పలువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా కరోనా అనుమానితుల జాబితాలో ఉన్నాయంటున్నారు. ఢిల్లీ వెళ్లిన ఓ ఎమ్మెల్యే బావమరిది ఏకంగా 500 మందికి విందు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు వారందరిని గుర్తించిన అధికారులు వారికి క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో షాక్ ఏంటంటే సదరు పార్టీలో గుంటూరు జిల్లాకే చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మరి కొందరు ప్రజా ప్రతినిధులకు సైతం ఈ వైరస్ సోకిందా ? లేదా వాళ్లకు కూడా క్వారంటైన్ అవసరమా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారులు సైతం ఈ ప్రజాప్రతినిధులను ఎలా గుర్తించాలి ? వీళ్లను ఎలా క్వారంటైన్ చేయాలి ? అన్న సందేహంలో ఉన్నారట.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple