షాకింగ్: చైనాలో మళ్లీ చెలరేగిన కరోనా... ఈ కరోనా కి ఇక అంతం లేనట్లేనా?

Arun Showri Endluri
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తున్న కరోనా వైరస్ మొట్టమొదట చైనాలో ఉద్భవించినట్లు మన అందరికీ తెలిసిందే. వుహాన్ జంతువుల మార్కెట్ లో మొట్ట మొదటి సారి బయటపడ్డ ఈ వైరస్ ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో 5 లక్షల మందికి సోకింది. రోజువారీగా కనీసం ఈ వైరస్ బారిన పడి వెయ్యి మంది చనిపోతున్నారు. దాదాపు రెండు నెలలు చైనా దేశాన్ని పీడించిన కరోనా వైరస్ వల్ల మూడు రోజుల క్రిందట ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే కొద్ది రోజులు గడిచాక ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే ఈ వైరస్ బారినుండి కోరుకున్న వారిలో దాదాపు 14 శాతం మంది మళ్లీ ఈ వైరస్ సోకిన లక్షణాలను చూపించడం మొదలు పెట్టారట. వెంటనే చైనాలో ఈ వైరస్ తన ప్రభావం చూపించబోతోంది అంటూ చాలా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఇలా రెండోసారి దాని బారిన పడినవారు ఈసారి లక్షణాలు ఏమీ చూపించరని కొంతమంది చెబుతుండడంతో చైనా దేశం మొత్తం హడలిపోయింది. ఇక వైద్య పరిశోధకులను దీని గురించి ప్రశ్నించగా వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కరోనా వైరస్ ఒక మనిషి శరీరంలో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకునేందుకు 'న్యూక్లీక్ ఆసిడ్' టెస్టులను చేస్తారట. అయితే న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ యొక్క ఖచ్చితత్వం 30 నుండి 50 శాతం వరకు ఉంటుందని వాంగ్ అనే ఒక డాక్టర్ వెల్లడించాడు. అంతేకాకుండా వుహాన్ లోని ఒక హాస్పిటల్ లోని డాక్టర్ చెప్పేది ఏమిటంటే కరోనా బారినుండి తప్పించుకొని బయటపడిన 147 పేషెంట్లలో మళ్ళీ ఐదుగురికి కరుణ పాజిటివ్ అని తేలిందట. ఈ లెక్కన మళ్ళీ కరుణ విజృంభించే అవకాశం భారీగా ఉందని వారు అంచనా వేస్తున్నారు.ఏదేమైనా ఈ కరోనా భూతం చైనాను ఇప్పట్లో వదిలేలా లేదు.

_________________________________________________________

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: