తెలంగాణ: పెద్దపల్లిని శాసించే పెదరాయుడు ఎవరు..?

Pandrala Sravanthi
కాకా నాటి వైభవం వస్తుందా.?
 కుమ్ములాటలతో బీజేపీ
 గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్.
 తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు సెగ్మెంట్లలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గం. అలాంటి ఈ నియోజకవర్గంలో  ఈసారి పోటీ చాలా రసవత్తరంగా మారింది. మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉద్దండులు పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిజెపి నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మరి ఈ ముగ్గురు కీలక నాయకుల పోటీలో పెద్దపల్లిని శాసించే నాయకుడు ఎవరు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకప్పుడు పెద్దపల్లి కాకా ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది.కానీ గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ హవా నడిచింది. ఈ పార్లమెంటు స్థానంలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి పెద్దపల్లిలో ఈసారి భారీగా మెజారిటీ సాధించి తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ఈసారి బీజేపీ కూడా మోడీ హవాతో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇక బీఆర్ఎస్ పాత పట్టును మరోసారి సాధించాలని తహతహలాడుతోంది. ఈ విధంగా మూడు పార్టీలు ఎవరికి వారే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్లమెంటు సెగ్మెంట్ లలో దాదాపు 14 లక్షల 42 వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. మొత్తం 7చోట్ల 6,82,000 పైచిలుకు ఓట్లు సాధించి ఏకాధిపత్య చక్రాన్ని తిప్పింది కాంగ్రెస్.ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మూడు లక్షల 36వేల ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి కేవలం 79 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ హవా కొనసాగించినా, పార్లమెంటు ఎన్నికల సమయానికి కాస్త పరిస్థితులు మారాయని బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ లో చేరడంతో కొప్పుల ఈశ్వర్ కు ఆ టికెట్ ఖరారు చేసింది. ఇక గోమాస శ్రీనివాస్ ను ఇక్కడి నుంచి బీజేపీ బరిలో ఉంచింది.
 బలబలాలు:
ఇక కాంగ్రెస్ అభ్యర్థి వంశీ విషయానికి వస్తే.. ఆయన తాత ఎంతో పేరు కలిగిన వ్యక్తి. అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్ కు మంచి పట్టుతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి వంశీని గెలిపిస్తేనే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వంశీ. సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు చెబుతూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాలను నిలదీస్తూ ముందుకు వెళుతున్నారు. ఈసారి మాకే ఓట్లు పడతాయనే ధీమాతో ఆయన ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..ఇక్కడ చాలా డల్ అయిపోయింది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు నేతలు నామినేషన్ పత్రాలు అందుకుని నామినేషన్ వేశారు. ఇందులో గోమాస శ్రీనివాస్ చాలా వెనుకబడి పోయారు. బీజేపీ లో గ్రూప్ గొడవలు విపరీతంగా రావడంతో ఇక్కడ బీజేపీ తేలిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: