ఒకపక్క కరోనా భయంతో వణుకుతున్న జనాలు.. మరోపక్క విచ్చలవిడిగా..

Satvika

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించినవ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..

 

 

 

ఈ విషయం పై ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. 

 

 

 

ఇది ఇలా ఉండగా మరోపక్క రాష్ట్రాల్లో విద్య సంస్థలు , సినిమా హాళ్లు ఎక్కిక్కడ మూసివేసినట్లు తెలుస్తుంది. అయితే కరోనా భయం కన్నా విద్యార్థులలో సెలవులు దొరికాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలో జరగనున్న పలు పరీక్షలు వాయిదా పడినట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. ఈ  నేపథ్యంలో ఐఐటీ ఢీల్లీ త్వరలో జరగనున్న పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. క్లాసులను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. క్యాంపస్ ప్రాంగణంలో ఎటువంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకూడదని ఆదేశించింది. 

 

 

 

విషయానికొస్తే.. మరి ఎంత ఐఐటీలో చదువుకుంటున్నా వారు కూడా విద్యార్థులే కదా? అందుకే  ఈ ప్రకటన విద్యార్థుల గొప్ప ఊరట కలిగించింది. దీంతో వారు ఆనందం పట్టలేక జై కరోనా అని నినదిస్తూ.. డ్యాన్సులు చేశారు. కరకోరమ్ హాస్టల్‌లో గురువారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్ వేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: