కరోనా దారుణం.. ఒకే రోజు ఇటలీలో 196 మంది మృతి!

Edari Rama Krishna

ప్రపంచం ఇప్పుడు కరోనా భారిన పడిందా అనిపిస్తుంది.. ఏనాడూ ఇంత ప్రభావం ఏ వైరస్ వల్ల కూడా రాలేదు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ మనుషులకు ప్రాణాంతకంగా మారింది.  వందలు కాదు.. వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి.. వేల మంది ఈ కరోనా భారిన పడుతున్నారు.  అయితే ఇప్పుడు చైనాలో కరోనా అదుపులోకి వస్తుందన్నా.. ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీలో దారుణంగా ప్రబలి పోతుంది.  ముఖ్యంగా ఇటలీపై కరోనా పంజా విసురుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 12,462 మందికి వైరస్ సోకగా 827 మంది మరణించారు. ఇందులో బుధవారం ఒక్క రోజే 196 మంది చనిపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 

 

కరోనా ప్రమాదకరంగా విజృంభిస్తుండటంతో ఇటలీలో మొత్తంగా క్వారంటైన్ ప్రకటించారు. దీనిపై ఆ దేశ ప్రధాన మంత్రి గ్యుసెప్పి కాంటే ప్రజలకు సందేశం ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతోపాటు బ్యూటీ సెలూన్ల వంటివి కూడా రెండు వారాల పాటు మూసేయాలని ఆదేశించారు.  కరోనాకు ఇప్పటి వరకు యాంటీ డోస్ కనిపెట్టక పోవడం మైనస్ గా మారింది.  అయితే కరోనాకు యాంటీ డోస్ లేకపోవడం వల్ల ప్రజలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని.. మాస్క్ దరించి బయట తిరగాలని.. ఒక వేళ కరోనా సిమిటమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే హస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలని... ఎక్కువ జనాలు ఉన్న చోటు ఉండకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు.

 

ఇలా జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా ఇటలీలో అత్యవసర సర్వీసులు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు వంటివి మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు.  అంతే కాదు పర్యాటకుల విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలుస్తుంది.  మొత్తానికి ఇటలీని కరోనా కంగారు పెట్టిస్తుంది. జనాలకు భయబ్రాంతులు కలిగిస్తుంది. తాజాగా మనను మనం కాపాడుకునేందుకు బాధ్యతగా ఉందని ప్రజలకు ఇటలీ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: