ఆ కండిషన్ మీద రఘువీరా ని వైకాపా లోకి రమ్మన్న జగన్ ?

KSK

ఏపీ పీసీపి మాజీ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి అయిన రఘువీరా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అయింది. అతని రాకకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేత గా మరియు మచ్చలేని నాయకుడుగా రఘువీరా రెడ్డి కి చాలా మంచి పేరు ఉంది. అలాగే వైయస్ కుటుంబంతో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తూనే.... వైఎస్ కు నమ్మకస్తుడిగా మరియు కుడి భుజంగా ఉంటూ వచ్చాడు.

 

అయితే వైఎస్ మరణం తరువాత ఏమైందో ఏమో తెలీదు కానీ కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న దీన స్థితిని గమనించి ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి తన సొంత వ్యాపారాలు చూడుకోసాగాడు. గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా రెడ్డి మళ్లీ వైసీపీ లో చేరేందుకు కారణం వైయస్ జగనే అని అనంతపురంలో చర్చ జరుగుతుంది. తన తండ్రి వైయస్‌కు ఆప్తుడిగా.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న రఘువీరా రెడ్డి తమ పార్టీలోని ఎప్పుడొచ్చినా సరే.. స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నానని జగన్ రఘువీరారెడ్డికి ఇదివరకే చెప్పినట్లు తెలుస్తోంది.

 

అయితే జగన్ రఘువీరా పార్టీలోకి చేరే ముందు ఒక షరతు విధించినట్లు ఇప్పుడు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉన్నాయి. రెడ్డి గారు పార్టీలో చేరాక ఉన్నఫలంగా పదవులు ఆశించరాదని అతనికి జగన్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో కొమ్ములాట్లు పెరిగిన నేపథ్యంలో వచ్చిన వెంటనే అతనికి ఒక పెద్ద పదవిని కట్టబెట్టేస్తే పార్టీ నేతల్లో తనపై ఉన్న విశ్వసనీయత పోగొట్టుకున్న వాడిని అవుతాడని జగన్ బాధట. దీనికి రఘువీరా కూడా సరే అనడంతో స్థానిక ఎన్నికల లోపలే రఘువీరా రెడ్డిని వైసీపీ కండువాతో చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: