పెళ్ళైన మూడురోజులకే భార్యకు రెండు నెలల గర్భం.. అలా ఎలా?

Satvika

సాధారణంగా ఒక మహిళా గర్భం ధరించాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందన్న సంగతి తెలిసిందే.. కానీ ఇక్కడ విచిత్రంగా పెళ్ళైన మూడురోజులకే భార్యకు రెండు నెలల గర్భం అని తెలుసుకున్న ఓ భర్త షాక్ కు గురయ్యాడు. అందంగా ఉంది కదా అని పెళ్లి చేసుకున్న అతనికి మింగుడు పడని ఒక వార్త విని కుమిలిపోయాడు. మూడు రోజులకే రెండు నెలల అని ఆశ్చర్యపోతున్నారు. 

 

 


ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌‌లో వెలుగుచూసింది.బులంద్‌షహర్ జిల్లా నైమాండి చౌకి గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. పెళ్లయిన మూడోరోజే ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు రెండో గర్భవతి అని తేల్చారు. పెళ్లయిన మూడు రోజులకు రెండు నెలల గర్భం ఎలా వస్తుందని ఆలోచనలో పడిన ఆ యువకుడు కాసేపటికే నిజాన్ని గ్రహించాడు.

 

 


అతను గట్టిగా ఆమెను నిలదీయగా అసలు విష్యం బయట పడింది.. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె సినిమాలు, షికార్లంటూ ఆ ప్రేమజంట విచ్చలవిడిగా తిరుగుతూ హద్దులు దాటేసింది. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ శారీరకంగానూ కలిసేశారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను నిర్బంధించి మరో యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారు.. 

 

 


పెళ్లైన మూడో రోజుకే ఆమె గర్భం బయటపడటంతో వారు ఆందోళనలో పడ్డారు. దీంతో మోసపోయానని గ్రహించిన భర్త తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కాడు. ప్రియుడితో శారీరకంగా కలిసిన తర్వాత కూడా తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని, ఆమె కారణంగా తన కుటుంబ పరువు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు తాను ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని, అత్తారింటికి వెళ్లే తనకు ప్రాణహాని ఉంటుందని ఆ యువతి న్యాయస్థానానికి చెప్పుకొచ్చింది. అయితే ఆమెను ఆసుపత్రిలో ఉంచాలని కోర్టు నిర్ణయించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: