దేవుడా!! ఈ నేతలు జగన్ కారణంగానే కరోనా వైరస్ వచ్చిందని అన్న అంటారు..!

Suma Kallamadi

ప్రస్తుతం సెలబ్రిటీలు గా సినిమా పరిశ్రమలో, రాజకీయంలో కొనసాగుతున్న వ్యక్తులు తాము ఏమో మాట్లాడుతున్నారో తమకే అర్థం కాకుండా మాట్లాడి నవ్వులపాలు అవుతున్నారు. మొన్నీమధ్య టాలీవుడ్ నటి ఛార్మి కౌర్ కరోనా వైరస్ గురించి తప్పుగా మాట్లాడింది. దీంతో ఆమెకు నెటిజనులు చివాట్లు పెట్టి మరీ బుద్ధి చెప్పారు. వెంటనే విమర్శలన్నిటికీ స్పందించిన ఛార్మి కౌర్ ఇటువంటి సున్నితమైన విషయాలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదని నాలుక కరుచుకుని, తప్పేంది అయ్యా బాబు అంటూ క్షమాపణ చెప్పేసింది.



ఐతే నిన్న నాగబాబు కూడా కరోనా వైరస్ గురించి వెగటు పుట్టించే కుళ్ళు జోకులు వేసి అందరి అసహ్యాన్ని కి, ఆగ్రహానికి గురయ్యాడు. సామాజిక మాధ్యమాలలో ఇతను చేసిన వ్యాఖ్యల్లో మొదటిగా ప్రజలు గుంపులు గా ఉండకండి, కరోనా వైరస్ వచ్చే ప్రమాదముందని చెప్పినట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే ఎవరికైనా రక్తం సలసలా మరుగుతుంది. ఒకపక్క ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ దాటికి కకావికలం అవుతుంటే మరోవైపు నాగబాబు లాంటి సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సి ఉంది పోయి వ్యంగ్యంగా కామెంటులు చేసి ఛీ కొట్టించుకుంటున్నారు.



ఆయన ఇంతకీ ఏమన్నాడంటే దేవుని భక్తులుకు ఓ చాలెంజ్ అట. దేవునిపై నమ్మకం ఉంటే గ్రూపులుగా ఏర్పడి ఆలయాలకు వెళ్లి, దేవున్ని దర్శించి, ప్రసాదం తీసుకొని ఇంటికి రావాలట. ఒకవేళ సురక్షితంగా ఇంటికి వస్తే దేవుడు గొప్పట, లేకపోతే కరోనా వైరస్ గొప్పట. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే నెటిజన్లు స్పందిస్తూ ఏం ఖర్మ రా! బాబు. భారతదేశంలో ఇప్పటికే 23 కరోనా వైరస్ సోకినా కేసులు నమోదు అయ్యి ప్రజలందరూ భయపడుతుంటే... అవగాహన కల్పిస్తూ ధైర్యం చెప్పాల్సింది పోయి ఇటువంటి జబర్దస్త్, అదిరింది షోలలోని కుళ్ళు జోకులు చెప్తాదేంటి ఇతను అంటూ నాగబాబుని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారికి కూడా తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఉండటం చాలా బాధాకరమని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ భార్య ఉపాసన కాస్త నయం అనిపిస్తుంది. ఆమె ఇప్పటికే కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తనవంతు గా చెప్పేసింది. ఇకపోతే వకీల్ సాబ్ వ్యాఖ్యలు నెట్టింట ఇంకా దర్శనం కాలేదని, ఒకవేళ అతను వ్యాఖ్యలు చేస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వల్లనే కరోనా వైరస్ వచ్చిందని అన్న అంటాడని నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: