తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా కరోనా కేసులు.?

praveen

చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తూ... ఇప్పటికే  దేశంలో వేల సంఖ్యలో ప్రాణాలు తీసుకుని.. ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్న  వైరస్ కరోనా. ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పటికి  భారతదేశంలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో మూడు కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా అలెర్ట్  అయిపోయాయి. అయితే ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసు నమోదు కావటంతో  ప్రజలు మరింత బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రంలో తొలి కరోనా  కేసు నమోదయింది. ఈ వ్యాధి రెండు వారాల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడికి సోకింది అంటూ నిర్ధారణ అయింది. 

 

 

 దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రాణభయంతో బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ యువకుడి కారణంగా ఇంక ఎంతో మందికి కరోనా  వైరస్ సోకి ఉండవచ్చని అటు వైద్యులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ యువకుడు రెండుసార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చాడు. ఇక తాజాగా ఈ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన బస్సు ఏపీకి చెందింది. అంతేకాకుండా ఈ యువకుడు వచ్చిన బస్సులో యువకుడి తో పాటు 27 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ యువకుడు తుమ్మినా దగ్గినా కరోనా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 

 

 

 ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇంకొంతమందికి కూడా కరోనా  వైరస్ సోకి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇక ఈ బస్సులో యువకుడితో ప్రయత్నించిన వారిలో ఏపీ వాసులు కూడా ఉండడం గమనార్హం. విశాఖ విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ బస్సులో ఉండడంతో ఏపీ వారికి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఒకవేళ కొంచెం కూడా అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఈ వైరస్ ఒకరి ద్వారా మరొకరికి విజృంభించే అవకాశం కూడా లేకపోలేదు.  ఇక తెలంగాణలో అయితే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందరూ కరోనా  అనుమతులకు సంబంధించి ఇప్పటికే అన్ని  ఆస్పత్రిలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను  ఏర్పాటు చేస్తున్నారు యువకుడికి సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులను కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: