జగన్ ను అంబానీ అలా కలిశాడు... మీటింగ్ అయిపోయాక 35 వేల కోట్లు ఇలా పోయాయి...?

Arun Showri Endluri
ముఖేష్ అంబానీ భారత దేశంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త. భారతదేశంలో నెంబర్ వన్ సంపాదకుడు అయిన ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 67 వేల కోట్ల డాలర్లు. ఈయన గంటకు 7 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇద్దరూ ఏపీలో పెట్టబోయే పెట్టుబడుల గురించి మరియు కొన్ని పర్సనల్ విషయాల గురించి చర్చించుకున్నారు. అయితే ఆ భేటీ అయిపోయిన తర్వాత ఇంటికి తిరుగుముఖం పట్టిన అంబానీ కి పెద్ద షాక్ తగిలింది.

ప్రస్తుతం చైనాలోకరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం భారీగా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం తయారీ పరిశ్రమ అయిన చైనా నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళాల్సిన ఉత్పత్తుల సంఖ్య పడిపోయింది. చైనా ప్రాడెక్టులను సైతం వివిధ దేశాలు నిషేధించాయి. ఇక అత్యధిక ఆర్థిక బలం కలిగిన చైనా నుంచి లావాదేవీలు నిలిచిపోయిన కారణంగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు ఊహించలేని స్థాయిలో కుదేలయ్యాయి.

అయితే కరోనా ఎఫెక్ట్ తో అపర కుబేరుడు ముకేష్ తో పాటు దేశంలోని పారిశ్రామికవేత్తల సంపద కరిగిపోయింది.ఫిబ్రవరి 12 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 13శాతం విలువ కోల్పోయాయి. 2019తో పోలిస్తే అంబానీ సంపద 5 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. ఇక ఈ ఎఫెక్ట్ అంబానీ మీదనే కాదు.. ఇతర పారిశ్రామికవేత్తల మీద కూడా పడింది..ఆదిత్యబిర్లా సంపద 884 మిలియన్ డాలర్లు నష్టపోయారట.. అజీమ్ ప్రేమ్ జీ869 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ఆయా కంపెనీల వాటాల విలువలు తగ్గాయి. దీనికంతటికి కరోనా వైరస్ ప్రభావమే కారణంగా చెబుతున్నారు. వైరస్ కారణంగా కొనుగోలు అమ్మకాలు పడిపోవడమే రిలయన్స్ నష్టాలకు కారణంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: