పేరు మార్చుకొని పదహారేళ్లుగా పోలీసు గా చలామణీ అవుతున్న దొంగ..
పోలీసులు దొంగలను పట్టుకోవడం కోసం సివిల్ డ్రెస్సులో వెళ్లడం చూసాం.. అలానే ఎన్నో కేసులను ఛేదించారు. అయితే ఫర్ ఏ చేంజ్ ఓ వ్యక్తి పేరు మార్చుకొని పోలీసు డిపార్ట్మెంట్ లో కొనసాగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫేక్ పత్రాలతో పోలీస్ ఉద్యోగం తెచ్చుకున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొంతకాలంగా సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్‌లతో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు.గత కొద్దీ రోజుల నుండి అతనిపై పోలీసులకు అనుమానం రావడంతో రహస్యంగా విచారణ చేయడం మొదలుపెట్టారు. దాంతో అసలు రంగు బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా పేరే మార్చేసుకున్నాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగం పొందాడు.
ఏకంగా పోలీస్ శాఖలోనే చేరడం గమనార్హం. అలా ఇప్పటికే 16 ఏళ్లు పనిచేశాడు. అతనిపై అనుమానం వచ్చిన పోలీస్ శాఖ రహస్యంగా విచారణ జరపడంతో ఉద్యోగం కోసం మనిషి పేరే మార్చేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్నీ అరెస్ట్ చేసి .. ఊసలు లెక్కపెట్టిస్తున్నారు.. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అశోక్ రెడ్డి పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి 2004 పోలీస్ రిక్రూట్మెంట్ సెలక్షన్స్‌కి ఎంపికయ్యాడు. అప్పటి నుంచి పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించాడు.ఇన్ని రోజుల వరకు పోలీసులకే ఎలాంటి అనుమానం రాకుండా పోలీసు ముసుగులో... విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డి తిరుతో ఒకింత పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు
ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు..ఎవరికీ అనుమానం రాకుండా ఇన్ని రోజులు చలామణీ అవుతున్న ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అశోక్ రెడ్డి అలియాస్ సుధాకర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మోసాన్ని పసిగట్టలేని విదంగా అతను నటించాడని పోలీసులు షాక్ లో ఉన్నారు. అతన్నే విచారణ చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.