అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సెక్యూరిటీ సీక్రెట్స్ తెలిస్తే వామ్మో అనాల్సిందే..?

Chakravarthi Kalyan
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

మరి అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి అధునాత పరికరాలు వాడతారు..ఓసారి చూద్దాం.. అమెరికా అధ్యక్షుడిగా పేరు, ప్రతిష్ఠలు ఏ స్థాయిలో ఉంటాయో ముప్పూ అదే స్థాయిలో ఉంటుంది. మరి అలాంటి నేతకు భద్రత కల్పించడం ఎలా? అమెరికా అధికార యంత్రాంగం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? విదేశీ పర్యటనల సమయంలో ఏం చేస్తుంది? చూద్దాం.

అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం ఏడాది పొడవునా సీక్రెట్‌ సర్వీస్ ఏజెన్సీ పని చేస్తుంటుంది. చీమ చిటుక్కుమన్నా దానిని పసిగట్టేంతగా నిఘా పెడుతుంది. అధ్యక్షుడు టాయ్‌లెట్‌కు వెళ్లినా ఆ పరిసరాలపై నిఘా సీక్రెట్ సర్వీస్ నిఘా ఉంటుంది. ఇక

ప్రెసిడెంట్ కు అందించే ఆహారాన్ని ముందు సీక్రెట్ ఏజెంట్లు పరీక్షిస్తారు. వంటలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా నియమించిన వంటవారు, సిబ్బంది విదేశీ పర్యటనలకు అధ్యక్షుడి వెంటే వస్తారు. విదేశీ పర్యటనలో అధ్యక్షుడు బస చేసే ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. ఇక అధ్యక్షుడు ఉండే గదిలో కిటికీలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ అద్దాలను బిగిస్తారు. అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా వలయాన్ని దాటి వెళ్లకూడదు.