దారుణం : స్కూల్ లో చితక్కొట్టుకున్న విద్యార్థులు... విద్యార్థి దుర్మరణం..?

praveen

స్కూల్లో చదువుతున్నప్పుడు అంతా ఎంతో కలిసిమెలిసి ఉంటారు. అప్పుడప్పుడు విద్యార్థుల మధ్య చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారూ. మళ్లీ ఆ తర్వాత కలిసి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దారుణ ఘటన జరిగింది. విద్యార్థుల మధ్య జరిగిన గొడవ  ఘటన ఓ నిండు  ప్రాణాన్ని బలిగొంది. ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఫుట్బాల్ ఆడుతుండగా.. ఆట విషయంలో వచ్చిన వివాదం తో వాగ్వాదానికి దిగారు. ముగ్గురు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు ఈ ఘటనలో ఓ  విద్యార్థి చనిపోయాడు మరో విద్యార్థి గాయాలయ్యాయి. 

 

 వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ ఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థులు ఎంతో బాగా ఫుట్బాల్ ఆట ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఆట విషయంలో ముగ్గురి మధ్య ఓ వివాదం మొదలైంది. మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దిగారు ముగ్గురు విద్యార్థులు. దీంతో ఈ విద్యార్థుల మధ్య చెలరేగిన చిన్న గొడవ పెద్దది గా మారి  ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అశోక్ అనే విద్యార్థి చనిపోయాడు... మరో విద్యార్థి తీవ్ర గాయాలయ్యాయి. అయితే విద్యార్థుల మధ్య ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ పాఠశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. 

 

 ఇక ఇదే విషయమై పాఠశాల యాజమాన్యంను  ప్రశ్నిస్తే ... విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని... మైదానంలో  ఆడుకుంటూ విద్యార్థి కుప్పకూలిపోయాడు అంటూ స్కూల్ టీచర్లు చెబుతున్నారు. కుప్పకూలిపోయిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు అంటున్నారు ఉపాధ్యాయులు. కాగా చనిపోయిన విద్యార్థు తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకుని కొట్టి చంపారు అంటూ ఆరోపిస్తున్నారు. ఇక తమ కొడుకు అశోక్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసు లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: