భోజనానికి పిలిచి హత్యచేసి ముక్కలుగా కోశాడట.. ఎక్కడో తెలుసా..
ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి అపార్టుమెంట్లో అతిథులుగా వచ్చిన వారిని చంపి ముక్కలుగా కోసేవాడట.. అతని పిచ్చి ఏంటి అని అందరు అనుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా ఆ అపార్టుమెంటులో పైపులు బ్లాకవుతున్నాయి. కిచెన్, టాయిలెట్ల నుంచి నీరు వెళ్లడం లేదు. కొద్ది రోజుల తర్వాత ఆ నీరు పైకి ఎగదన్నడం ఆరంభమైంది. అందులో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి దీనిపై అపార్టుమెంటు యజమానికి ఫిర్యాదు చేశాడు.
దీంతో ఆయన మెయింటెనెన్స్ వర్కర్లతో పైపు లైన్లు, డ్రైనేజీ మరమ్మతులు చేయించాడు. ఈ సందర్భంగా వర్కర్లకు పైపుల నుంచి మాంసం ముద్దలు, ఎముకల రద్దు కనిపించాయి. ఫస్ట్ టైం చూసినప్పుడు అదేదో చికెన్, మటన్ పీసెస్ అయ్యి ఉంటాయని అనుకున్నారు కానీ కొద్దీ రోజుల నుండి మనుషుల వేళ్ళు కాళ్లు కూడా వస్తున్నాయని అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ డ్రైనేజీలోకి మనిషుల శరీర భాగాలు ఎలా వచ్చాయి? ఇంతకీ, ఆ యజమానికి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు? ఈ మిస్టరీ ఘటనలో ట్విస్ట్ ఏమిటో తెలియాలంటే ముందుగా ఈ హత్యలు గురించి తెలుసుకోవాల్సిందే.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.. అపార్టుమెంటులో ఉంటున్నవాళ్లను బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అనంతరం ఒక్కో ఇంటిని సోదా చేస్తూ వచ్చారు. పై ఫ్లోర్‌కు వెళ్లేవరకు ఒక్క అనుమానితుడు కూడా దొరకలేదు. కానీ, తాళం వేసి ఉన్న ఒకే ఒక్క ఫ్లాట్‌పై పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు ఆ ఫ్లాట్ తలుపులు బద్దలకొట్టి లోపలికి వెళ్లి చూశారు.
నిజానికి ఆ అపార్టుమెంటులో ఉన్నది ఒక ఒక గే.. అతను మనసు పడ్డ మగాళ్లను వశపరుచుకొని వాళ్ళను అతి దారుణంగా చంపేవారు. అలా చాలా మందిని ఇంటికి విందుకు అని పిలిచి చంపేసేవాడు. చివరికి పోలీసులు అపార్టుమెంట్ మొత్తం గాలింపులు జరపి.. చివరికి నిల్సన్ ఫ్లాట్ తలుపులు బద్దలకొట్టి చూశారు. ఆ ఫ్లాట్ కుళ్లు కంపు కొట్టడంతో ఆ హత్యలు చేసింది అతడేనని నిర్ధరించుకున్నారు. అదే రోజు మాటువేసి నిల్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పైన చెప్పిన హత్యల చిట్టా అంతా నిల్సన్ విచారణలో వెల్లడించిన విషయాలే. అతడికి కేవలం 12 నుంచి 15 హత్యలు మాత్రమే గుర్తున్నాయి. మిగతావాళ్ల పేర్లు చెప్పలేకపోయాడు.. మరో విషయమేంటంటే ఇప్పటికి ఆ అపార్ట్మెంట్ అందుబాటులో ఉండటం గమనార్హం