ప్రేమలో అబ్బాయిల ఓటు.. అమ్మాయిల అందానికా.. సెక్సీ ఫిగర్ కా..?.. షాకింగ్ వాస్తవం..
ఇక ప్రేమకు సంబంధించిన మరిన్ని విషయాల్లోకి వెళ్తే.. అమ్మాయిలకు తమ ప్రియుడి ఎదురుగా కూర్చుంటే నచ్చుతుందట. అలా ఎదురుగా కూర్చుని కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడితే నచ్చుతుందట. అయితే ఈ విషయంలో అబ్బాయిల టేస్ట్ వేరు.. అబ్బాయిల పక్క పక్కన కూర్చుని మాట్లాడటానికి ఎక్కువగా ఇష్ట పడతారట. అలాగే ఈ ప్రేమలో ఆనందంతో పాటు విషాదమూ ఉంటుంది. హృదయం ఓర్చుకోలేనిదీ గాయం అన్న పాట విన్నారు.. కదా.. అది నిజమే. ఇష్టమైన వాళ్లు దూరమైతే గుండె బద్దలైనంత పనవుతుంది. ఈ పరిస్థితికి ఓ పేరు కూడా ఉంది. దాన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారట. ఇవండీ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ కబుర్లు.