మసాజ్ పార్లర్ కు వెళ్లి శీలంతో పాటు డబ్బు పోగొట్టుకున్న యువకుడు..!

Suma Kallamadi

ప్రస్తుతం మానవుడు జీవిస్తున్న కాలానికి అనుగుణంగా సరికొత్త వ్యాపారాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి తాను ఎదుర్కొంటున్న ఒత్తిడుల కారణంగా ఎంతో అలసి పోతున్నాడు. అయితే ఈ అలసటని పోగొట్టుకునేందుకు చాలామంది బాడీ మసాజ్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులోని భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఒక వ్యక్తి... మసాజ్ చేయించుకోవడానికి ఓ పార్లర్ల కోసం వెతకగా... అతనికి 'విదేశీ అమ్మాయిలతో మసాజ్ చేయించబడును', అనే ఒక ప్రకటన కనిపించింది.



దీంతో విదేశీ అమ్మాయిల కదా అనేసి.. వెంటనే ఆ పార్లర్ సెంటర్ కు వెళ్లి బాడీ మసాజ్ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆ సందర్భంలోనే మసాజ్ చేసేందుకు ఒక ఫారెన్ గర్ల్ వచ్చి ఇతడితో మాట్లాడసాగింది. ఈ క్రమంలోనే ఆ పార్లర్ లో మసాజ్ తో పాటు శారీరక సుఖం దొరుకుతుందని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. తర్వాత తనకి శారీరక సుఖం కావాలని ఆ విదేశీ యువత అడిగినంత డబ్బులు ఇచ్చి ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అంతా అయిపోయిన తర్వాత అతడు చాలా సంతోషంగా మసాజ్ సెంటర్ నుండి ఇంటికి వెళ్లిపోయాడు. కొంత సమయం గడిచిన తర్వాత.. అతడి వాట్సాప్ కి ఒక వీడియో వచ్చింది.



ఆ వీడియో ఏమిటా అని ప్లే చేసి చూడగా... అందులో అతడు విదేశీ యువతితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు దర్శనమయ్యాయి. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న సదరు వ్యక్తికి ఏం చేయాలి పాలు పోలేదు. ఆ సమయంలోనే అతనికి ఒక వ్యక్తి ఫోన్ చేసి... తాను అడిగినంత డబ్బులను ఇవ్వకపోతే ఆ వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అలా చేస్తే తన పరువు పోతుందని భావించిన సదరు వ్యక్తి... బ్లాక్మెయిల్ చేసే ఆగంతకుడికి చాలా డబ్బులు ఇచ్చేశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్లీ ఆ ఆగంతకుడు ఫోను చేసి... డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు.



దీంతో విరక్తి చెందిన సదరు బాధితుడు... పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. తక్షణమే స్పందించిన పోలీసులు ఆ మసాజ్ పార్లర్ పై రైడ్ చేసి నిర్వాహకులతో పాటు విదేశీ యువతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మసాజ్ పేరిట ఓ కేంద్రాన్ని నడుపుతూ... వచ్చిన కస్టమర్లని రెచ్చగొట్టి వ్యభిచారం నడిపిస్తున్నారని.. ఆపై వీడియోలు తీసి వారి నుండి లక్షల సొమ్ముని కాజేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: