సుఖ‌సంసారం: య‌వ్వ‌నంలో గ‌ర్భం దాల్చితే వ‌చ్చే స‌మ‌స్య‌లివే?

Arshu
యుక్త వయసులో గర్భం దాల్చటం వలన ముందు తరాలలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అమెరికాలో చాలా మంది యుక్త వయసు గల వారు గర్భాన్ని ధరిస్తున్నారు మరియు 175,000 కంటే ఎక్కువ మంది వారి మొదటి సంతానానికి జన్మని ఇస్తున్నారు. యుక్త వయసులో వచ్చే గర్భాల వలన చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

యుక్త వయసులో గర్భం దాల్చటం, అనగా 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల అమ్మాయి గర్భం దాల్చటాన్ని యుక్త వయసు గర్భం అంటారు, వీరు చట్ట పరంగా మైనర్ గా గుర్తింపబడతారు. మొదటగా ప్రసవాన్ని ధరించే స్త్రీలలో 67 శాతం మంది ఆడవారు 18 నుండి 19 వయసు గల ఆడ వారు ఉన్నారు. యుక్త వయసులలో కలిగే గర్భాలలో 80 శాతం నియంత్రించలేనివి. 17 కంటే తక్కువ వయసు ఉన్న వారిలో గర్భం వలన చాలా సమస్యలు కలుగుతున్నాయి. 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వయసు గల వారిలో గర్భం వలన ఎక్కువ తల్లులు చనిపోతున్నారు. ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే యుక్త వయసులో గర్భం ధరించటం అనేది రోజు రోజుకు పెరుగుతుంది.

 గర్భం దాల్చే 10 మందిలో 7 మంది ఆడవారు మొదటి త్రైమాసికలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఇందులో ఎక్కువగా ఆడవారు ఆల్కహాల్ ని తీసుకోవటం లేదా పొగత్రాగటం వంటివి చేస్తున్నారు, కావున వీరు గర్భసమయంలో అధికంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు.


రుతు క్రమంలో మార్పులు మరియు లోపాలు, ఓకారాలు లేదా వామిటింగ్స్, నిపిల్స్ లేదా స్థనాలలో గాయాలు, అలసట ఎక్కువగా రావటం, చిరాకులు, అధిక రక్త పీడనం. అలాగే యుక్త వయసులలో వచ్చే గర్భం నుండి జన్మించిన శిశువులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. అందులో ముఖ్యంగా వీరిలో జ్ఞాపక శక్తి లోపాలు, అవయవ లోపాలు, పెరుగుదల లోపాలు పోషకాల లోపాలతో జన్మిస్తున్నారు.

 చిన్న వయసులో గర్భం ధరించిన ఆడ వారు గర్భ సమయంలో గర్భంలో ఉండవలసిన శరీర బరువు కన్నా ఎక్కువ లేదా తక్కువ బరువుని కలిగి ఉంటున్నారు, దీని వలన పుట్టే పిల్లలు తక్కువ బరువు లేదా అధిక బరువుతో మరియు అనేకమైన ఆరోగ్య సమస్యలతో పుడుతున్నారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులలో అభివృద్ధి చెందని శరీర భాగాలతో జన్మిస్తున్నారు. ఇందులో ఎక్కువగా శ్వాస సంబంధిత, పేగులలో సమస్యలతో, గుండె సంబంధిత సమస్యలు, మెదడులో స్రావాలు మరియు కొన్ని భయంకర సమస్యలతో కొన్ని సార్లు మరణాలతో జన్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: