అరే! మైసూరాకు మెలుకువొచ్చిందే.. జగన్‌పై ఈ బాణాలేంటో...?
మైసూరారెడ్డి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎందుకో పెదవి విప్పలేదు, గడప దాటలేదు.. ఇది అందరికి తెలిసినదే. పైగా ఆయన బాబు తరం రాజకీయ నాయకుడు, బాగా సీనియర్ కూడా!. అయినా నాడు సీమ గురించి పల్లెత్తు మాట మాట్లాడని మైసూరారెడ్డి ఇపుడు సమరశంఖం పూరిస్తున్నారు. ఇది ఒకింత ఆశ్చర్యమే కానీ, తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని పలు రాజకీయ నాయకుల పరిశీలన. సీమకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ గద్దిస్తున్నారు.
రాయలసీమకు కనీసం హైకోర్టు బెంచ్ కూడా ఇవ్వని చంద్రబాబుపై పోరు చేయని మైసూరా.. జగన్ మీద మాత్రం గట్టి బాణాలే సంధిస్తున్నారు. రాజధానిని కర్నూల్లో పెట్టాలని మైసూరారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ కచ్చితమైన అమలుకు పూనుకోకపోతే గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని కోరుతామని తెగేసి చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని మరీ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తామని అంటున్నారు. ఆయనకు టీడీపీ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు వత్తాసు పలుకుతున్నారు. ఈ వృధ్ధ నాయకులు ఉద్యమాలు చేయగలరా అన్నదే.. ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది.
అయితే ఈయన గతంలో మూడు రాజధానుల విషయమై ఈ విధంగా స్పందించారు. రాజధానిగా అమరావతి నిర్ణయంపై తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని..ఇద్దరూ సీఎంలు రాయలసీమవాసులు అయి ఉండి రాయలసీమవాసులేనన్నారు. రాజధాని కావాలని ఉత్తరాంధ్రా వాసులు ఎప్పుడు అడగలేదనీ..రాయలసీమవాసులు మొదటినుంచి క్యాపిటల్ డిమాండ్ చేస్తున్నారనీ అడిగినవారికి ఇవ్వకుండా అడగనివారికి ఇవ్వటమేంటి అంటూ మైసూరా ప్రశ్నించారు. విశాఖకు పాలనా రాజధాని రాయలసీమ నుంచి విశాఖకు సెక్రటేరియట్ కు వెళ్లాలంటే చాలా కష్టమని కాబట్టి సీమలోనే రాజధాని పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక విశాఖను పాలనారాజధాని అంటున్నారనీ కానీ కర్నూలులే పరిపాలనా రాజధాని చేయాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాయలసీమలను రాష్ట్రంగా చేయమని డిమాండ్ చేశారు. విడిపోవటానికి మేం సిద్దంగా ఉన్నామని కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు మైసూరారెడ్డి. ఇప్పుడు రాజధాని అమరావతి రైతులు భూముల్ని త్యాగం చేశాం కాబట్టి మాకు అన్యాయం జరిగిందంటున్నారు.