అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారుగా.. ఇదంతా కేవలం పది రోజుల్లోనే..!

DRK Raju
ఏమైనా చెనీయులు చెనీయులే.. వారికీ వల్లే చాటి. అభివృద్ధి విషయంలో అసలు వేలు పెట్టి చూపించే ప్రసక్తే లేదు. ఏదిఏమైనా అసాధ్యమన్నది శుధ్యమైంది. అది వాళ్ళకే చెల్లింది.  చూస్తూండగానే వెయ్యి పడకల భారీ ఆస్పత్రి ఆవిష్కృతమైంది. ఇది చైనీయులు సాధించిన అద్భుతం. అప్పటి దాకా అదో ఖాళీ స్థలం! పది రోజుల్లో ఆ స్థలం స్వరూపమే మారిపోయింది. భవన నిర్మాణ కూలీలు నేలను చదును చేయగానే ఇంజనీర్లు ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలు తెచ్చి బిగించడం ప్రారంభించారు. కార్పెంటర్లు చకచకా చెక్కపని చేస్తుంటే.. ప్లంబర్లు ఒకదాని తర్వాత మరొకటిగా పంపులు, పైపులు బిగించేశారు! లైట్లు, ఫ్యా న్లు బిగించడంలో ఎలక్ట్రీషియన్లు బిజీ అయిపోతే.. టైల్స్‌ వేసేవాళ్లు, గ్రౌటింగ్‌ చేసేవాళ్లు తమ పని తాము చేసుకుపోయారు.

మరికొన్ని విశేషాలు..
25 వేల చదరపు మీటర్ల (2,69,000 చదరపుటడుగుల) విస్తీర్ణంలో కట్టిన ఈ భారీ ఆస్పత్రిలో 1400 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.. అందరూ కలిపి 7000 మంది నిపుణులు శ్రమించారు. ఇందులో 30 ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లున్నాయి. వేరే నగరాల్లో, దేశాల్లో ఉండే వైద్యులను సంప్రదించడానికి ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. 20 మంది సభ్యులున్న కమాండో టీమ్‌ ఈ వ్యవస్థను 12 గంటల్లోనే ఏర్పాటు చేసింది.

రోగుల గదుల్లోకి వెళ్లకుండానే వారికి వస్తువులను ఆస్పత్రి సిబ్బంది ఇవ్వడానికి వీలుగా రెండువైపులా తెరిచి ఉండే కేబినెట్లను ఏర్పాటు చేశారు.  ఈ ఆస్పత్రికి 25 మైళ్ల దూరంలో మరో ఆస్పత్రి నిర్మిస్తున్నారు. 3,23,000 చదరపుటడుగుల విస్తీర్ణంలో 1600 పడకలతో నిర్మితమవుతోంది. 100 గజాల స్థలంలో చిన్న ఇల్లు కట్టడానికే 3-4 నెలలు పడుతుంది. అలాంటిది 11 రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రిని కట్టి చైనీయులు తమ సత్తా చాటారు.

వూహాన్‌లో ప్రారంభమై ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స చేసేందుకు కట్టిన ఆస్పత్రి ఇది. దీనికివారు హౌషెన్‌షాన్‌ హాస్పిటల్‌ (అగ్ని దేవుడి పర్వతం)గా నామకరణం చేశారు. జనవరి 24న ఈ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైంది. ఆదివారం (ఫిబ్రవరి 2) చివరి ఇటుక పేర్చడం పూర్తికాగా.. సోమవారం నుంచి వైరస్‌ బాధితులకు చికిత్స కూడా మొదలైంది. ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌ విధానం వల్లనే ఈ ఆస్పత్రి నిర్మాణం ఇంత త్వరగా పూర్తయింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: