జ‌గ‌న్ కొత్త ట్రెండ్ ఇదే... బాబోరు ఫుల్ క‌న్‌ఫ్యూజ్‌..!

రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. లేకపోతే రాజకీయంగా వెనకబడడమే కాకుండా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతుంది. ఇది అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడంపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలో జగన్ నిర్ణయానికి పూర్తి స్థాయిలో మద్దతు లభించగా, అమరావతిలో కేవలం కొన్ని గ్రామాల్లో వ్యతిరేకత కనిపించింది. 


అది కూడా టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఏదో ఘోరం జరిగిపోతుంది అన్నట్టుగా హడావుడి చేసి కొంతమంది టీడీపీ అనుకూల రైతులను, ప్రజలను రెచ్చగొట్టి అమరావతి జేఏసీ ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రమంతా హడావుడి చేసే చేసే ప్రయత్నం చేశారు. దీంతో వైసిపి కాస్త ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంది. ఎట్టకేలకు ఏపీ అసెంబ్లీ లో మూడు రాజధానుల బిల్లును శాసన మండలికి పంపింది. ఈ బిల్లు కమిటీ కి వెళ్లడం తదితర పరిణామాలు జరిగాయి. అయితే టిడిపి మాత్రం ఇంకా అమరావతి ప్రాంత, రైతులతో ఉద్యమాలు చేస్తూ భారీగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. 


దీనిని అడ్డుకునేందుకు వైసీపీ ఇప్పుడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్నే తాము కూడా అనుసరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రం మొత్తం మూడు రాజధానులు ముద్దు అంటూ భారీగా ర్యాలీలు ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్ష టీడీపీ తోపాటు జనసేన ఇతర పార్టీలలో కలవరం మొదలైంది. 


ఈ తరహా కార్యక్రమాలు జగన్ మొదలు పెడతారని బాబు ముందుగా ఊహించలేకపోయారు. తాము కేవలం అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ జగన్ ఇలా రాష్ట్రమంతా మైలేజ్ పెంచుకునే దిశగా మూడు రాజధానుల వ్యవహారాన్ని ముందుకు తీసుకు వెళ్లడంతో టిడిపి అధినేత చంద్రబాబు షాక్ గురైనట్లు తెలుస్తోంది. ఈ తరహా ర్యాలీలతో, వైసీపీ ప్రభుత్వం పై మరింతగా ప్రజల ఆదరణ పెరుగుతోంది అనే సంకేతాలు కూడా చంద్రబాబుకు మింగుడు పడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: