నిర్భయ కేసులో ఉరి ముగ్గురికేనా.. ఎందుకు..?

praveen

దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల నిర్భయ అనే యువతిపై జరిగిన అత్యాచారం ఘటనపై ఇప్పటికీ నిందితులకు శిక్ష పడడం లేదు. నిర్భయ కేసులో నిందితులను శిక్షించేందుకు ప్రత్యేకంగా నిర్భయ చట్టం తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ఏళ్లు గడుస్తున్నాయి కానీ నిందితులకు ఉరిశిక్ష మాత్రం పడలేదు. మొత్తంగా నిర్భయ కేసులో ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో ఆ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా... ఇక మరో నిందితుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా  ప్రస్తుతం నలుగురు నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధిస్తూ డెత్ వారెంట్ లు  కూడా జారీ చేసింది. 

 


 ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించింది ... ఈ కేసులో నిందితులు  ఉరిశిక్ష బయటపడడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం లాంటివి చేస్తున్నారు. ప్రతి చోట నిర్భయ కేసులో నిందితుల అభ్యర్థులను తిరస్కరిస్తూ ఉన్నప్పటికీ ఉరి శిక్ష మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. కాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష పడాల్సి ఉంది . అయితే ఉరిశిక్ష వాయిదా  వేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు నిందితులు. 

 

 ఈ క్రమంలోనే నిర్భయ నిందితుల్లో  ఒకరైన వినయ్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరారు. అతను పిటీషన్ను రాష్ట్రపతి తిరస్కరించినప్పటికీ... నిబంధనల ప్రకారం మరో నిందితుడైన ముఖేష్ కి ఇచ్చినట్లుగానే తనకు కూడా 14 రోజులు గడువు ఇవ్వాలని దీనికోసం ఉరిశిక్ష వాయిదా వేయాలంటూ అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్  ఢిల్లీ హైకోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఈ పిటిషన్ ను  పెండింగ్లో ఉంచింది. ఈ క్రమంలోనే వినయ్ మినహా మిగతా ముగ్గురు నిందితులకు ఉరి తీయడం లో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది దిల్లీ హైకోర్టు. 

 

 అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ కేసులో నిందితులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారని చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో వినయ్ కి సంబంధించిన పిటిషన్లు పెండింగ్లో పెట్టడంతో.. నిర్భయ కేసులో మరో ముగ్గురు నిందితులకు  రేపు ఉరి శిక్ష పడుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కాగా నిర్భయ కేసులో నలుగురు నిందితులు మరణదండన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: