ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసిపి ఏం చేసిందంటే..?

ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఏపీని కేంద్రం ఆదుకోవాలంటూ అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏపీకి విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని ఆందోళనలు చేయడమే కాకుండా... ఢిల్లీకి ప్రత్యేక రైళ్లల్లో వెళ్లి ఆందోళనలు ఆందోళనలు నిర్వహించింది. అయితే అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టి, వైసీపీ పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఆ సందర్భంగా పోలీసులతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కూడా ప్రయత్నాలు చేసింది. అయినా వైసిపి వెనక్కి తగ్గకుండా ఆందోళనను కొనసాగించింది. 


ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు అందరిని ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాజీనామా చేయించి దేశవ్యాప్తంగా ఈ అంశం ప్రజల్లో చర్చ జరిగేలా చేశారు. ఆ తర్వాత బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ అంటూ  ప్రకటించింది. చంద్రబాబు కూడా హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ మాట్లాడుతూ  వైసీపీ చేపట్టిన ఉద్యమాన్ని అవహేళన చేశారు. ఏపీలో ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఏపీకి ప్రత్యేక హోదా అమాశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది. ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు ఏపీ అభివృద్ధికి సంబంధించి 9 అంశాలను కూడా ఇప్పుడు లేవనెత్తింది. 


రెవెన్యూ లోటు బకాయిలు రూ.18,969 కోట్లు వెంటనే విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి కోసం 23 వేల కోట్లు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అది కాకుండా పోలవరం ప్రాజెక్టు కోసం స సవరించిన రూ.55,548 కోట్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాల కోసం ఏపీకి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని అడుగుతోంది. తాజాగా పార్లమెంట్ లైబ్రరీ భవనం లో అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఈ డిమాండ్ లు  చేసింది. పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి , మిథున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: