కరోనా వైరస్ గురించి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పిన బ్రహ్మంగారు...?
ప్రపంచంలోని దేశాలన్నింటినీ ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనా దేశంలోని విహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. మన దేశంలో కూడా ఈ వైరస్ బారిన కొందరు పడినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనదేశంలో కరోనా వైరస్ సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలను సంబంధించిన ప్రింట్ వైరల్ అవుతోంది.
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి
కోడిలాగ తూగిసచ్చేరయ !!శివ!!
ఈ పద్యంలో బ్రహ్మంగారు ఈశాన్య దిక్కులో విషాన్ని వ్యాపింపజేసే విషగాలి పుడుతుందని లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతారని చెప్పారు. కోరంకి అనే జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చస్తారని అన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి, కరోనా వైరస్ పేర్లు కూడా దగ్గరగా ఉండటం గమనార్హం. భారతదేశానికి చైనా కూడా ఇంచుమించు ఈశాన్యం దిక్కులోనే ఉంది.
వైరల్ అవుతున్న ఈ పద్యాన్ని చూసి చాలా మంది నెటిజన్లు కరోనా వైరస్ వలన పెను ప్రమాదమే ముంచుకొస్తోందని భయభ్రాంతులకు గురవుతున్నారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఇప్పటికే చాలా సందర్భాలలో నిజంగా జరిగాయి. బ్రహ్మంగారు చెప్పినట్టే ఇప్పుడు కూడా లక్షల మంది ప్రజలు చనిపోతారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో ఇప్పటికే 4000 కేసులు అధికారికంగా నమోదు కాగా వీరిలో ఇప్పటికే 106 మంది మరణించారు. మరోవైపు దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోయినా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ఇప్పటికే చేపట్టాయి. శంషాబాద్, వైజాగ్ విమానశ్రయాల్లో ఇప్పటికే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే వారిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.