చంద్రబాబు దుమ్ము దులిపేసిన ప్రొ. నాగేశ్వర్ ..  సమాధానం చెప్పగలరా ?

Vijaya
మూడు రాజధానుల వివాదం రాష్ట్రంలో సెగ పుట్టిస్తున్న సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే కొత్తగా ఎవరికీ పరిచయటం అవసరం లేదు. తనదైన శైలిలో లాజిక్కులతో, పాయింట్లతో ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు.  అలాంటి ప్రొఫెసర్ రాజధానిపై తాజాగా చంద్రబాబును ఉద్దేశించి సూటి ప్రశ్నలు సంధించారు.

ఇంతకీ ప్రొఫెసర్ వేసిన ప్రశ్నల బాణాలు ఏమిటంటే విశాఖపట్నం కేంద్రంగా జగన్ ఏర్పాటు చేయాలని అనుకున్న ఎగ్జిక్యూటివ్ రాజధానిపై మీ వైఖరి ఏమిటి ? ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న టిడిపి ఎంఎల్ఏలపై చర్యలను ఏమన్నా తీసుకుంటున్నారా ?  అలాగే కర్నూలులో జ్యూడిషియల్ రాజధాని గా హై కోర్టు ఏర్పాటుపపై పార్టీపరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా ? హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయటానికి మద్దతిస్తున్న రాయలసీమ నేతలపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ?

చంద్రబాబు మాత్రం అన్నీ రాజధానిలోనే ఉండాలని, రాజధానిగా అమరావతిని మార్చకూడదని డిమాండ్ చేస్తున్నపుడు జగన్ ప్రతిపాదనకు మద్దతిస్తున్న టిడిపి నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ?  శ్రీబాగ్ ఒప్పందానికి చంద్రబాబు మద్దతిచ్చేట్లయితే అసలు టిడిపి హయాంలోనే కర్నూలులో హై కోర్టు ఎందుకు పెట్టలేదు ?

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలోని 13 జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నది అసెంబ్లీలోనే చెప్పారు. మరి ఆ పద్దతిలో  జిల్లాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు ?   ఐదేళ్ళ హయాంలో తాను  చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ పై శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేయగలరా ?   టిడిపి ఆరోపిస్తున్నట్లుగా విశాఖపట్నంలో  వైసిపి నేతలు పాల్పడిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించేందుకు ఏమైనా ఆధారాలున్నాయా ? లేకపోతే అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను సమర్ధించుకునేందుకు చేస్తున్న ఎదురు దాడేనా ?

రాజధాని నిర్మాణానికి సంబంధించి నాసిరకం కట్టడాలు, చదరపు అడుగుకు రూ. 10 వేలు చెల్లించినట్లు వైసిపి ఆరోపిస్తోంది. వైసిపి ఆరోపణలను టిడిపి ఎందుకు ఖండించలేకపోతోంది ? ఆరోపణలను ఖండించకోవటం వల్ల భారీగా అవినీతి  జరిగిందనే  అనుమానాలు కలుగుతున్నాయి కదా ? అంటూ అనేక అంశాలపై చంద్రబాబును దుమ్ము దులిపేశారు. మరి ప్రొఫెసర్ ప్రశ్నలకు  చంద్రబాబు సమాధానాలు చెబుతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: