ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇంటర్ లో గ్రేడింగ్ విధానం రద్దు... ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ లో ప్రస్తుతం అమలులో ఉన్న గ్రేడింగ్ సిస్టంను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం గ్రేడింగ్ సిస్టం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భావించి గ్రేడింగ్ రద్దు చేయడం గురించి పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంటర్ తర్వాత జరిగే పలు ఎంట్రన్స్ పరీక్షలలో ఇంటర్ మార్కులకే వెయిటేజీ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రేడింగ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని భావిస్తోంది. గతంలో మాదిరిగా ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ విద్యా మండలి ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం అమలులోకి రాకముందు మార్కులు ఇచ్చేవారు. సబ్జెక్టుల వారీగా వచ్చిన మొత్తం మార్కులకు ఒక గ్రేడ్ మాత్రమే ఇచ్చేవారు. ఇంటర్ విద్యా మండలి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులు ఇవ్వాలా లేక మార్కులు ఇచ్చి పాస్/ ఫెయిల్ ఇవ్వాలా....? అనే విషయంపై కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.
ఇంటర్ విద్యామండలి ఇందుకోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను కూడా అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది. గతంలో ఇంటర్మీడియెట్ లో విదార్థులు మార్కులు, ర్యాంకుల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని భావించి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ గ్రేడింగ్ విధానం అమలులో ఉండటం వలన అనేక సమస్యలు వస్తున్నాయి. అందువలన ప్రభుత్వం గ్రేడింగ్ రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం నిర్ణయం పట్ల విద్యార్థులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.