అమిత్ షా ఇంటి నుండి మంత్రికి ఫోన్.. 3 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్... చివరిలో ట్విస్ట్ ఏంటంటే..?

praveen

ఈ రోజుల్లో ఘరానా మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆగంతకులు ఫోన్ చేయడం వివరాలు తెలుసుకోవడం డబ్బులు కాజేయడం ఇలాంటివి రోజుకోటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాము  అని హర్యానా మంత్రికి  ఫోన్ చేసి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు ఇక్కడ ఇద్దరు యువకులు. మూడు కోట్ల రూపాయల దండుకుని జల్సాలు చేద్దాం అనుకున్నారు. చివరికి వ్యూహం వికటించి కటకటాల పాలయ్యారు.

 

 

 

 వివరాల్లోకి వెళితే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం నుంచి కాల్ చేస్తున్నామంటూ హర్యానా మంత్రికి చౌతాలా కు  ఫోన్ చేశారు.పార్టీకి విరాళంగా 3 కోట్ల  రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన మంత్రి చౌతాలా ... స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల సహకారంతో హర్యానా భవన్ లో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇద్దరు యువకులు ముక్తార్  సింగ్ ఉపకార్ సింగ్ లుగా గుర్తించారు. పోలీసులు. తమదైన స్టైల్లో విచారణ చేయడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇంతకీ నిందితులు ఎలా ఈ నేరానికి పాల్పడ్డారో తెలిస్తే షాక్ అవుతారు. ఒపేరా బ్రౌజర్ ను  ఉపయోగించి యాప్  డౌన్లోడ్ చేసినట్లు విచారణలో తెలిపారు . 

 

 

 

 దాని నుంచి మంత్రి చౌతాలా కు ఫోన్ చేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నారు. అయితే  సదరు యువకులు ఉపయోగించిన యాప్ భారత్ లో  నిషేధించినట్టు  పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరు నిందితుల్లో ఒకరు సీర్సలో లెదర్  షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ ఉండగా... మరో యువకుడు టాక్సీ  నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం ఓ వివాదం సెటిల్ మెంట్ విషయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఓ టీవీ సీరియల్ చూసిన సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకున్న ఇద్దరు... సోషల్ మీడియా సహాయంతో మంత్రికి  ఫోన్ చేసి అమిత్ షా  ఇంటి నుంచి మాట్లాడుతున్నామని పార్టీ కోసం మూడు కోట్ల రూపాయల పంపించాలి డబ్బులు డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఈ ఇద్దరు  పోలీసుల కస్టడీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: