అవినీతి మరకలు అంటని వారు దేశం మొత్తంలో వారొక్కరే..?

praveen

దేశంలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నేటి సమాజంలో ఏ రంగమైనా అవినీతి మయం అయిపోయింది. కానీ దేశం మొత్తంలో అవినీతి మరకలు లేని వారు ఎవరైనా ఉంటే అది కేవలం రైతన్నలు మాత్రమే. ఆరుగాలం పొలంలో కష్టపడి భూ తల్లికి సేవ చేసి దాని ద్వారా వచ్చిన ధాన్యాన్ని  పది మందికి పంచి పెట్టి కడుపు నింపడమే రైతన్నలకు తెలుసు... అయితే ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఏర్పడింది రైతులకు. కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారికి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి కానీ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మాత్రం మద్దతు ధరలు ప్రకటించాలని కోరితే మాత్రం లాఠీచార్జీలు జరుగుతున్నాయి. మళ్లీ ఎన్నికలు వస్తే రైతేరాజు అని చెబుతుంటారు రాజకీయ నాయకులు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం రైతు ఎవడు అంటూ చీప్ గా చూస్తున్నారు. 

 

 

 

 పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా ప్రభుత్వాల నుంచి కనీస స్పందన కరువైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించక ... వేసిన పంట చేతికి రాక... చేతికొచ్చిన కొంచం  పంటకు మద్దతు ధర లేక రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతన్నల ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు. రైతు చనిపోతే నష్టపరిహారం ఇస్తున్నారు కానీ రైతు ఉన్నప్పుడే పంటకు మద్దతు ధర మాత్రం కలిపించడం లేదు ఏ ప్రభుత్వం. అయితే రైతులు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచించకుండా నూతన పద్ధతి ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలి అని పలువురు సూచిస్తున్నారు. 

 

 

 నాటి తరం వ్యవసాయానికి స్వస్తి పలికి సేంద్రియ ఎరువులు వేసి అధిక దిగుబడి తో పాటు మంచి లాభాలను ఆర్జించవచ్చు అని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. నేడు లోకమంతా హైబ్రిడ్ మయం అయిపోయింది. హైబ్రిడ్ విత్తనాలు రావడంతో ఈ పంటలు దిగుబడి పూర్తిగా తగ్గింది. దీంతో పంటలకు పెట్టుబడులు మాత్రం రైతులకు అవుతున్నాయి లాభాలు మాత్రం కార్పొరేటు వారివి అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే రైతులకు బాధ ఉండదు కదా . దేశంలోని అన్ని రంగాలు అవినీతి మయంలో జోగుతుంటే ఒక అన్నదాత మాత్రం భూమిని నమ్ముకొని ఇంకా వ్యవసాయం చేస్తూ మోసపోతూనే ఉన్నాడు. మోసం చేయడం  చేతగాని వ్యక్తి ఒక రైతన్న మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: