దిశ హత్య కేసు నిందితుల విగ్రహాలు పెట్టనున్న గుడిగండ్ల గ్రామస్తులు... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Reddy P Rajasekhar

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులకు రీపోస్టుమార్టం తరువాత అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. నిందితులలో చెన్నకేశవులు, శివ, నవీన్ గుడిగుండ్ల గ్రామానికి చెందిన వారు కాగా అరీఫ్ స్వస్థలం జక్లేర్ గ్రామం. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గుడిగుండ్ల గ్రామస్తులు దిశ హత్య కేసు నిందితుల విగ్రహాలు ఊరిబయట పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 
 
దిశ హత్య కేసు నిందితులలో ముగ్గురు నిందితులు గుడిగుండ్ల గ్రామానికే చెందినవారు కావడంతో గుడిగుండ్ల గ్రామానికి కూడా కొంత చెడ్డపేరు వచ్చింది. గ్రామస్తులు నిందితుల విగ్రహాలను ఏర్పాటు చేయటానికి ఒక ముఖ్యమైన కారణమే ఉంది. గ్రామస్తులు ఊరి బయట నలుగురు నిందితుల విగ్రహాలను పెట్టటం వలన వీరి విగ్రహాలను చూసైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ విగ్రహాలను చూసిన కొత్త వ్యక్తులు వీరు ఏమైనా ఘనకార్యం చేశారా అని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే గ్రామస్తులు విగ్రహాల కింద వీరు చేసిన దారుణమైన పని ఏంటి వీళ్లు ఎలా చనిపోయారు అనే విషయాల సమాచారం  ఉంచి విగ్రహాలను ప్రతిష్టించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విగ్రహాలను చూసి కొంతమందైనా మారితే సంతోషమని గ్రామస్తులు భావిస్తున్నారని సమాచారం. భవిష్యత్తు తరాలకు కూడా దిశ ఘటన గురించి నిందితులకు పడిన శిక్ష గురించి తెలియాలని గ్రామస్తులు భావిస్తున్నట్టు సమాచారం. 
 
త్వరలో విగ్రహాలను గ్రామస్తులు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ తరువాత తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారం, హత్య కేసులు తగ్గుతాయని భావించినా అత్యాచార ఘటనలు తగ్గకపోవటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలలో మార్పులు చేయాలని నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తే మాత్రమే అత్యాచార ఘటనలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా అత్యాచార ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: