జిఎన్ రావు కమిటీ నివేదికతో... ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌కు టెన్ష‌న్‌... టెన్ష‌న్‌..?

praveen

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన అంశం ఒక్కటే అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానిలు  ఏర్పడే అవకాశముందని అమరావతి తో సహా విశాఖ కర్నూలులో మరో రెండు రాజధానిలు  ఏర్పడవచ్చు అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల  నిర్ణయంపై విపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్తున్నారు. అటు అమరావతి రైతులందరూ జగన్ నిర్ణయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పండించే భూమిని రాజధాని నిర్మాణం కోసం భవిష్యత్తు తరాల కోసం ఇస్తే  ఇప్పుడు రాజధాని మార్పు చేస్తానంటారా  అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

 

 వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయం వల్ల ప్రజలు ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చే అవకాశమున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు . అయితే కొంతమంది జగన్ నిర్ణయాన్ని పసమర్దిస్తుంటే...  ఇంకొంతమంది జగన్ నిర్ణయం సరైనది కాదు అంటూ  తప్పుబడుతున్నారు . అటు అమరావతి రైతులు కూడా మూడు రోజుల నుండి రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నారు. అమరావతి లో మొత్తం పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 


 అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ నిర్ణయం  ఇబ్బంది గా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజల్లోకి వచేందుకు  ఇబ్బంది పడుతున్నారని వార్తలు  కూడా వినిపిస్తున్నాయి. అయితే మూడు రోజుల నుండి అమరావతి ప్రాంతంలో తీవ్ర స్థాయి లో రైతులు నిరసన తెలుపుతుంటే.. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం బయటకు వచ్చి తమ అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేయలేదు . అమరావతి  స్థానిక వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల  నిర్ణయం తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడానికి కాస్త భయం గా ఉన్నారని  ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. స్థానిక నేతలు కూడా కొందరు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని వార్తలు కూడా ప్రచురితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ముందు ముందు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: