జగన్ అంటే ప్రాణమీ అనిల్ కుమార్ యాదవ్ కు !
2008 సంవత్సరంలో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్ గా ప్రస్థానం ప్రారంభించిన అనిల్ కుమార్ యాదవ్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో వైసీపీ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచారు. జగన్ అంటే వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే ఆరోపణలకు ధీటుగా స్పందించటంలో అనిల్ కుమార్ యాదవ్ ముందుంటారు.
నీటి పారుదల శాఖా మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గతంలో పవన్ కళ్యాణ్ జగన్ కు సమస్యలను మోదీ ముందు ప్రస్తావించే ధైర్యం లేదని వ్యాఖ్యలు చేయగా మంత్రి అనిల్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జగన్ దమ్మూ, ధైర్యం ఏంటో రాష్ట్రంలో అందరికీ తెలుసని ఎవడి దమ్మెంతో ఎవరి ధైర్యమెంతో అందరికీ తెలుసని అన్నారు. పవన్ వేషాల్లేక, రాజకీయాల్లో ప్యాకేజీలతో బ్రతుకుతున్నాడని వ్యాఖ్యలు చేసి జగన్ పై తన అభిమానాన్ని అనిల్ చాటుకున్నారు.
ఎన్నికలకు ముందు అనిల్ కుమార్ యాదవ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైనికులు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. జగన్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జగన్ అంటే తనకు అభిమానమని, ప్రాణమని అనిల్ కుమార్ యాదవ్ చెప్పకనే చెప్పారు.
అనిల్ కుమార్ యాదవ్ కొన్ని నెలల క్రితం జగన్ గురించి మాట్లాడుతూ సోనియా గాంధీనే ఎదురించిన వ్యక్తి జగన్ అని జగన్మోహన్ రెడ్డి మతం మానవత్వమని పవన్ కు కౌంటర్ ఇచ్చారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోను అనిల్ కుమార్ యాదవ్ జగన్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. సీఎం జగన్ కు సన్నిహితుల్లో ఒకరిగా ఉంటూ వైసీపీని నమ్ముకొని మాస్ ఇమేజీని సొంతం చేసుకున్న అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా మాజీ మంత్రి నారాయణను ఓడించి గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ అంటే ప్రాణంగా అభిమానించే వారిలో అనిల్ కుమార్ యాదవ్ ముందువరసలో ఉండటం గమనార్హం.