మెకానిక్స్ గా పని చేసే వాళ్లే చోరీలు చేస్తున్నారు..!

praveen

భాగ్యనగరంలో బండి ఎక్కడైనా పార్క్ చేస్తున్నారా... అయితే బండి మాయం అవడం ఖాయం. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి మరి. బండి పార్క్ చేసి ఐదు నిమిషాలు పక్కకు వెళ్లినా..వచ్చేసరికి  ఆ బండి మాయం చేస్తారు కేటుగాళ్లు . హైదరాబాద్ లో ఇప్పుడు ఇదో  వ్యాపారంగా మారిపోయింది. ఒక్క బైక్ ఏమిటి...ఏ  షో రూమ్ లో కూడా లేనన్ని వెరైటీ బైకులు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. అదేదో కూరగాయల మార్కెట్ అన్నట్లుగా ఉంటుంది. బైక్  దొంగతనాలు చేసి అమ్ముతు సొమ్ము చేసుకుంటున్నారు . రోజురోజుకు హైదరాబాదులో బైక్ దొంగతనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక అటు పోలీస్ స్టేషన్లలో  బైక్ పోయింది అని లబోదిబోమంటూ జనాలు ఇస్తున్న కంప్లైంట్ కూడా పెరిగిపోతున్నాయి. 

 

 

 

 అయితే ఈ బైక్ కీ  మీ దగ్గరే ఉన్నప్పటికీ...  మీ బైక్ మాత్రం మాయం అవుతుంది . మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు మాత్రం పార్కింగ్ ప్లేస్ నుంచి బైక్ ఎత్తుకెళ్తున్నారు . బండి పార్కింగ్ లో ఉంటుంది కీ జేబులో  ఉంటుంది కానీ... అక్కడికి వచ్చి చూశాక మాత్రం బండి మాత్రం  ఉండదు. చాలా చోట్ల ఇలాంటి దొంగతనాలు  జరుగుతున్నాయి . హైదరాబాద్ నగరంలోని చాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మెకానిక్ గా పని చేసిన వాళ్ళు ఎక్కువగా బైక్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మెకానిక్ గా పని చేస్తున్నారు... డూప్లికేట్ తాళాలతో బైక్ ని పార్కింగ్ ప్లేస్ నుంచి స్వాహా చేస్తున్నారు. 

 

 

 

 అయితే తాజాగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న రెండు మాటలని అరెస్ట్ చేశారు పోలీసులు. మెకానిక్ గా పనిచేస్తున్న వారు ఎక్కువగా దొంగతనాలకు పాల్పడిన ముఠా లో సభ్యులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీళ్లే కాదు అంతకు ముందు కూడా చాలా బైక్ దొంగతనాలకు పాల్పడే ముఠాలను  అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగతనాలు చేసిన బైక్  లను  చూసి పోలీసులు కూడా  షాక్ కి గురయ్యారు.మెకానిక్ లు  బైక్ లను బాగుచేయడమె  కాదు బైక్ లను  స్వాహా చేయడం కూడా చేస్తున్నారు అంటూ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగరంలోని ఎన్నో పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నారని.. ఖరీదైన బైక్ ల దగ్గరినుంచి సాదాసీదా  బైక్ ల వరకు అన్నింటినీ టార్గెట్ చేస్తూ పార్కింగ్ ప్లేస్ నుంచి స్వాహా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిజంగానే మెకానిక్ గా పనిచేసే వాళ్లు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారా.. ఇలా అయితే బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఆహా అవ్వాల్సిందేనా... ఏంటో గాని వాహనదారులకు కొత్త భయం పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: